అందుకే 'సైరా' కి పోటీగా చాణ‌క్య‌?

Update: 2019-10-04 15:43 GMT
తెలుగు రాష్ట్రాల్లో  సైరా న‌ర‌సింహారెడ్డి ఇప్ప‌టికే  విజ‌య ఢంకా మోగించింది. పాజిటివ్ టాక్ దృష్ట్యా ఈ వీకెండ్ లో.. శ‌ని- ఆదివారాల్లో సైరా స్పీడ్ కి బ్రేకులు వేయ‌డం అసాధ్యం. ఈ నేప‌థ్యంలో శ‌నివారం గోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చాణ‌క్య రిలీజ్ అవుతోంది. ఈ సినిమా స‌క్సెస్ గోపీ చంద్ కు చాలా కీల‌కం. ఇప్ప‌టికే వ‌రుస ప‌రాజ‌యాల్లో ఉన్నాడు. స‌క్సెస్ కొట్టి మార్కెట్ ను మెరుగు ప‌రుచుకోక‌పోతే ప్ర‌తి కూల ప‌రిస్థితులు త‌ప్ప‌వు. అయితే సైరా ఊపులో చాణ‌క్య ఫలితాలు ఎలా ఉంటాయి? అన్న దానిపై కాస్త సందిగ్ధ‌త ఉంది. తొలి షోతో హిట్టు టాక్ తెచ్చుకుంటే ప‌ర్వాలేదు. సేఫ్ జోన్ లోకి వెళ్లిన‌ట్లే. లేదంటే సైరా స్పీడ్ ను త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌న్న‌ది నిపుణులు మాట‌. ఈ వీకెండ్ `సైరా`దే అప్ప‌ర్ హ్యాండ్. శ‌ని- ఆదివారాల్లో సైరా తెలుగు రాష్ట్రాల్లో  అన్ని థియేట‌ర్లు హౌస్ ఫుల్ అయ్యే ఛాన్సుంది.

సైరా టిక్కెట్లు దొర‌క‌ని ప‌క్షంలో హిట్టు టాక్ తెచ్చుకుంటే చాణ‌క్య వైపు చూసే అవ‌కాశం ఉంది. లేదంటే చాణ‌క్యకు ఓపెనింగులు క‌ష్ట‌మేన‌న్న‌ది చాలా మంది అభిప్రాయం. తాజాగా నేడు జ‌రిగిన ఇంట‌ర్వూలో గోపీచంద్ ని సైరాకి పోటీగా చాణ‌క్య‌ని రిలీజ్ చేస్తున్నారా? అని ప్ర‌శ్నించ‌గా ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. చాణక్య మే లో  విడుదల చేయాల‌నుకున్నాం. కానీ షూటింగ్ డిలే అవ్వ‌డంతో అక్టోబర్ 3న  విడుదల చేయాలనుకున్నాము.  అప్పటికీ సైరా విడుదల తేదీ ప్రకటించలేదు.  సైరా అక్టోబర్ 2 విడుదల అని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో రెండు రోజుల గ్యాప్ త‌ర్వాత అక్టోబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని నిర్ణ‌యించ‌కున్న‌ట్లు తెలిపారు.

ద‌స‌రా సెల‌వుల‌ను దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేస్తున్నామ‌ని.. పెద్ద బడ్జెట్ రిక‌వ‌రీ అవ్వాలంటే ఈ సీజ‌న్ అయితేనే క‌రెక్ట్ అని భావిస్తున్నామని ఇంత‌కుముందు ఓసారి గోపిచంద్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. నేటి ఇంట‌ర్వ్యూలో మ‌రోసారి ఈ విష‌య‌మై క్లారిటీనిచ్చారు. సైరాతో పోటీప‌డ‌డం అనే దానికంటే తాము ద‌స‌రా సెల‌వుల‌పైనే దృష్టి సారించామ‌ని చెప్ప‌క‌నే చెప్పారు గోపీ.

Full View

Tags:    

Similar News