సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాక చాలా జాగ్రత్తగా కెరీర్ ను సెట్ చేసుకోవాలి. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమా కథల ఎంపిక విషయంలోనే కాదు నలుగురిని అర్థం చేసుకుంటూ జీవితంతో ప్రయాణిస్తూ ఉండాలి. కానీ సొట్ట బుగ్గల సుందరి లావణ్య మాత్రం ఈ మధ్య కన్ఫ్యూజన్ లో చేజేతులరా మంచి సినిమాలను వదిలేసుకుంటోంది.
అసలే అమ్మడికి వరుస అపజయాలు దర్శనమిస్తుంటే మరో వైపు ప్రముఖ ప్రొడ్యూసర్స్ కి కోపాన్నీ తెప్పిస్తోంది. ఇదే తరహాలో ఈ మధ్య కాలంలో అమ్మడు ఏకంగా రెండు మంచి సినిమాలను వదిలేసుకుంది. విజయ్ దేవరకొండ - పరశురామ్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ తెరకెక్కించబోయే కథను లావణ్య కన్ఫ్యూజన్ తో వదిలేసుకుందని కొన్ని ఊహాగానాలు, కథనాలు వెలువడుతున్నాయి. అసలేం జరిగిందంటే.. తెలుగులో సూపర్ హిట్ అయిన 100% లవ్ సినిమాను తమిళ్ లో రీమేక్ చేద్దామని అక్కడి డైరెక్టర్ చంద్రమౌళి డిసైడ్ అయ్యాడు. హీరోయిన్ గా లావణ్య ని కూడా ఫిక్స్ చేశారు. ఆమె కూడా ఒకే అంది. అయితే ఆమె డేట్స్ కాస్త అడ్జస్ట్ కాలేదు.
దీంతో ఆమె ముందుగా ఒప్పుకున్న విజయ్ దేవరకొండ - పరశురామ్ సినిమా వల్ల డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని అనుకున్న చంద్రమౌళి.. లావణ్య కి తెలియకుండా గీత ఆర్ట్స్ నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసుకి లావణ్య మీ సినిమా చేయడం లేదు డేట్స్ కుదరడం లేదు అని చెప్పేశారట. దీంతో బన్నీ వాసుకి కోపమొచ్చి వెంటనే పరశురామ్ తో కూర్చొని రష్మీక మందనని ఒకే చేయించాడట. విషయం తెలుసుకున్న లావణ్య తమిళ్ డైరెక్టర్ మీద కోపంతో ఆ సినిమాను కూడా వదిలేసుకుందట. దీంతో అమ్మడు ఆ రెండు ప్రాజెక్టు లని సరైన అవగాహన లేకపోవడం వల్ల వదిలేసుకుందని ప్రస్తుతం సౌత్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.