వర్మ అందుకే ధైర్యంగా ఉన్నాడు!

Update: 2019-02-15 04:48 GMT
నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. విడుదలై ఒక్క రోజు కావడం ఆలస్యం మిలియన్ల వ్యూస్ వేలల్లో లైక్స్ వచ్చి పడుతున్నాయి. సోషల్ మీడియాలో దీని గురించి పెద్ద చర్చే జరిగింది. ట్రైలర్ చూసాక వర్మ మీద ఎన్నో ఏళ్ళ తర్వాత పాజిటివ్ కామెంట్స్ అందుకున్నది నిజం. స్వయానా లక్ష్మి పార్వతి ఇది చూసాక తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పుకోవడం హైప్ ని పెంచేందుకు తోడయ్యింది. ఇదిలా ఉండగా తమ కుటుంబ సభ్యుల వేష భాషలు ఎన్టీఆర్ గెటప్ మొత్తం సరిపోయేలా వర్మ ట్రైలర్ లో చూపించినా నందమూరి క్యాంప్ నుంచి ఏ ఒక్కరూ స్పందించకపోవడం కొత్త చర్చకు దారి తీస్తోంది.

ఎన్టీఆర్ రెండో పెళ్లి తర్వాత ఏం జరిగింది అనే దాని గురించి నిజాలే చూపిస్తాను అంటున్న వర్మ నందమూరి కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకోకపోయినా ఎందుకింత ధీమాగా ఉన్నాడు అనే సందేహం అభిమానుల్లో ఉంది. అయితే ఈ మౌనానికి కారణం ఉంది. చట్టప్రకారం చనిపోయిన వ్యక్తి బయోపిక్ తీయాలి అనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల అనుమతి అవసరమే. నిర్ణయకర్తగా మొదటి వ్యక్తి జీవిత భాగస్వామే అవుతారు. ఈ లెక్కన లక్ష్మి పార్వతి అధికారికంగా వర్మకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఒకవేళ వారసులు కోర్టులు వెళ్లినా ఆంతగా వర్క్ అవుట్ కాకపోవచ్చు.

ఎన్టీఆర్ చివరి శ్వాస వరకు లక్ష్మి పార్వతినే భార్యగా పక్కన ఉన్నారు. వాళ్ళ బంధానికి చట్టబద్ధత ఉంది. సో ఆవిడే తీసుకోమని వర్మకు చెప్పాక అభ్యంతర పెట్టడానికి ఎవరికీ అవకాశం ఉండదు. ఒకవేళ కోర్ట్ ద్వారా ట్రై చేసినా నెగ్గడం అంత ఈజీ కాదు. వర్మ ఆ ధైర్యంతోనే ఇంతకు సిద్ధపడినట్టు తెలిసింది. చిన్న కామెంట్ చేసినా వర్మ దాన్ని పబ్లిసిటీకి వాడుకుంటాడు కాబట్టి బాలయ్య బ్యాచ్ వ్యూహత్మకంగా సైలెంట్ గా ఉన్నట్టు సమాచారం. తెరవెనుక లాయర్లతో లక్మిస్ ఎన్టీఆర్ ను అడ్డుకునేందుకు తగిన మార్గాల కోసం చర్చలుజరుగుతున్నట్టు ఫిలిం నగర్ గాసిప్
   

Tags:    

Similar News