ఆ హీరోయిన్ హడావుడి పెళ్లి అందుకా?

Update: 2018-05-27 09:15 GMT
బాలీవుడ్ భామ నేహా ధూపియా నిర్వహించే టీవీ టాక్ షో చూసేవాళ్లకు ఆమె శైలి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ మొహమాటాలు లేకుండా తన షోకు వచ్చే అతిథుల ఆంతరంగిక విషయాలన్నీ బయటపెట్టించేస్తుంది. సెలబ్రెటీ ఎవరైనా సరే.. వాళ్ల సెక్స్ విషయాల్ని గుచ్చి గుచ్చి అడిగి మరీ తెలుసుకుంటుందామె. ఇలా చాలామందిని ముగ్గులోకి దించి.. వాళ్లు ఎప్పుడూ బయటికి చెప్పని విషయాల్ని చెప్పించిన ఘనురాలు నేహా. ఐతే అందరి రహస్యాలూ బయటపెట్టించే నేహా.. ఇప్పుడో రహస్యాన్ని దాచి పెట్టి హడావుడిగా పెళ్లి చేసుకున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. కొన్ని రోజుల కిందటే భారత స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ తనయుడు అంగద్ బేడీని నేహా హఠాత్తుగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

అంగద్-నేహా కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీళ్ల వ్యవహారం బాలీవుడ్లో అందరికీ తెలుసు. అలాంటపుడు ఇంత హఠాత్తుగా.. గుట్టు చప్పుడు కాకుండా పెళ్లెందుకు చేసుకుందా అని అంతా ఆశ్చర్యపోయారు. దీనికి అసలు కారణం.. ఇప్పుడు బాలీవుడ్ మీడియా వెలికి తీసింది. నేహా ప్రెగ్నెంట్ అయ్యిందని.. అబార్షన్ చేసుకోవడం ఇష్టం లేక హడావుడిగా పెళ్లి చేసుకుందని అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. పెళ్లి కొంచెం ఘనంగా చేసుకుంటే మీడియా.. జనాల దృష్టిలో హైలైట్ అవుతామని.. తర్వాత బిడ్డకు జన్మనిచ్చే సమయంలో నెలల లెక్కలు తీసి దీని గురించి డిస్కషన్లు పెడతారని.. కాబట్టి లో ప్రొఫైల్ పెళ్లి అయితేనే బెటరని నేహా-అంగద్ భావించినట్లుగా చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతో చూడాలి. ఏదో ఒక సందర్భంలో నేహా బయటికి రాకుండా పోదు. దీని గురించి మీడియా వాళ్లు ఆమెను అడక్కుండా పోరు. అసలు ముందు నేహా ప్రెగ్నెంటా కాదా అన్నది రూఢి చేసుకోవడానికి బాలీవుడ్ మీడియా గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
Tags:    

Similar News