`జబర్దస్త్` లోని ఓ టీమ్ లో మెంబర్ గా తన కెరీర్ ను మొదలెట్టిన షకలక శంకర్...ఈ తర్వాత టీమ్ లీడర్ గా - సినిమాల్లో కమెడియన్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. తాజాగా - కమెడియన్ నుంచి హీరోగా తనను తాను ప్రమోట్ చేసుకున్న షకలక శంకర్ `శంభో శంకర` తో అరంగేట్రం చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ.... శంకర్ ప్రదర్శనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ షోలో పాల్గొన్న శంకర్ ...అనేక షాకింగ్ విషయాలు వెల్లడించాడు. తనకు హీరో అని పిలిపించుకోవడం ఇష్టం లేదని - రెండేళ్లుగా పనిలేకపోవడంతో ఈ పనిని (హీరో) క్రియేట్ చేసుకున్నానని శంకర్ అన్నాడు. తనను పవన్ ఎందుకు తిట్టారో కూడా ఆ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
తాను ఆర్టిస్ట్ నని - `శ్రీ మంజునాథ` షూటింగ్ సమయంలో పేయింటర్ గా ఇండస్ట్రీలో కెరీర్ మొదలు పెట్టానని, ఆ తర్వాత 8 సంవత్సరాల వరకు ఇంటికి వెళ్లలేదని శంకర్ చెప్పారు. తాను చనిపోయానని కుటుంబసభ్యులు భావించారని...8 ఏళ్ల తర్వాత సినిమా ఆర్టిస్ట్ అయ్యానని చెబితే సంతోషించారని అన్నాడు. జబర్దస్త్ వల్లే తనకు పేరు వచ్చిందని - తన దగ్గర మ్యాటర్ అయిపోవడం వల్లే షోలు చేయడం మానేశానని అన్నాడు. అయితే, రెండేళ్లుగా అవకాశాలు లేక ఖాళీగా ఉండడంతో హీరోగా సినిమా చేశానని అన్నాడు. తాను పవన్ భక్తుడినని - ఆయన దగ్గర డబ్బులు లేవని - ఎంత డబ్బు పోసినా వెలకట్టలేని రేంజి - పవర్ ఆయన సొంతమని - పేరున్న పేద హీరో పవన్ అని అన్నాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్ ` షూటింగ్ లో డైరెక్టర్ తీసిన షాట్లే మళ్లీ మళ్లీ తీస్తూ నిర్మాత అయిన పవన్ డబ్బులు వృథా చేయడంతో కో డైరెక్టర్ మీద కోప్పడ్డానని అన్నాడు. అప్పుడే డైరెక్టర్లను - కో డైరెక్టర్లను అనే రేంజికి వచ్చావా? వాళ్లు ఎన్ని సార్లు తీస్తే నీకెందుకు? ఎంత డబ్బు పెడితే నీకెందుకు? నీ లిమిట్స్ లో నువ్వు ఉండు - నీ పని నువ్వు చేసి వెళ్లిపో.....అని పవన్ తనను మందలించారని అన్నాడు. ఆ సమయంలో అలీ కూడా అక్కడే ఉన్నానని గుర్తు చేసుకున్నారు.