మన దేశంలో 2008లో జరిగిన ఉగ్రవాద దాడులను స్వయంగా పాకిస్తాన్ స్థావరంగా చేసుకున్న లష్కర్ ఏ తోయబా అనే ఉగ్రవాద సంస్థ హఫీజ్ సయ్యిద్ నేతృత్వంలో చేసిందని తెలుసు. దీనికి ప్రధాన కారణాలైన వారందరూ ఇప్పడూ పాకస్తాన్ లోనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఒక స్పెషల్ ఆఫీసర్ ను పంపించి వీళ్ళందరినీ చంపించేస్తే ఎలా ఉంటుంది అనేదే సైఫ్ ఆలీ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ తీసిన ''ఫ్యాంటమ్'' సినిమా. కాని మనోళ్ళకు ఈ సినిమా ఎక్కలేదు. ఎందుకో?
నిజానికి ది బార్న్ ఆల్టిమేటమ్ వంటి సినిమాల కథలను ఆధారం చేసుకొని ఈ సినిమాలో హీరో డేనియల్ ఖాన్ క్యారక్టర్ ను సృష్టించారు. కాకపోతే మనోళ్లకు సరైన లాజిక్ తో కూడిన సీన్ లు చూపకపోవడం వలన.. ఇదేదో బొమ్మల సినిమా అనుకున్నారు. ఎందుకంటే ఒక మిలిటరీ ఆఫీసర్ ఒక 10 దేశాల్లో చాలా సింపుల్ గా తిరిగేస్తున్నాడంటే.. ఖచ్చితంగా దానికి కొన్ని లాజిక్కులను జోడించాలి. కాకపోతే ఇక్కడేమో కబీర్ ఖాన్ కేవలం ఎమోసన్స్ మాత్రమే పండించి లాజిక్కులు వదిలేశాడు. దానితో నవాబ్ పటౌడీ గారు కాస్త నిరాశ చెందక తప్పలేదు. కాకపోతే సినిమాలో కాన్సెప్టు మాత్రం అద్భుతమనే చెప్పాలి. దేశం కోసం నిజజీవితంలో ఇలా శ్రమించే హీరోలు ఉన్నారో లేదో తెలియదు కాని, ఉంటే మాత్రం బాగుండనే అనిపిస్తుంది.
ఇకపోతే ఈ సినిమాలో కనీసం యాక్షన్ సీన్ లను ఓ రేంజులో చూపించినా కూడా అవి బాగా వర్కవుట్ అయ్యేవంటున్నారు సినిమా ఎనలిస్టులు. మరీ సింపుల్ గా తీసేయడం కారణంగా ఇంత పెద్ద సమస్యకు అంత సింపుల్ సొల్యూషన్ ఏంటి అన్నట్లు కామెడీగా ఉందనేది వారి వాదన. ఏదేమైనా బజరంగీ భాయ్ జాన్ తో అలరించిన కబీర్ ఖాన్, ఈ సినిమాతో మాత్రం డిజప్పయింట్ చేశాడు.