10 బాష‌ల్లో ఒకేసారి కాబ‌ట్టే తేదీ చెప్ప‌లేదా?

Update: 2019-11-21 08:12 GMT
RRR కి సంబంధించి ప్ర‌తిదీ వైర‌ల్ గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్-ఎన్టీఆర్ అభిమానుల‌తో పాటు.. రాజ‌మౌళి అభిమానులు అంతే ఆస‌క్తిగా వేచి చూస్తున్న  త‌రుణ‌మిది. 2020 జూలై 30న రిలీజ్ అని ప్ర‌క‌టించారు కాబ‌ట్టి అప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక డిస్క‌ష‌న్ వేడెక్కిస్తూనే ఉంటుంది. 2.0- సాహో- సైరా త‌ర్వాత వ‌స్తున్న మ‌రో భారీ సౌత్ పాన్ ఇండియా చిత్ర‌మిది కావ‌డంతో ఆమాత్రం ఆస‌క్తి అభిమానులు స‌హా మార్కెట్ వ‌ర్గాల్లో ఉండ‌డం స‌హ‌జ‌మే.

నిన్న‌నే ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్ డీటెయిల్స్ ని మీడియాకు విడుద‌ల చేసింది దాన‌య్య బృందం. ముగ్గురు ప్ర‌ముఖ హాలీవుడ్ స్టార్లు న‌టిస్తున్నార‌ని.. తార‌క్ నాయిక ఫైన‌ల్ అయ్యింద‌ని.. ఇద్ద‌రు విల‌న్ ల‌లో ఒక లేడీ విల‌న్ .. మెయిన్ విల‌న్ ఉన్నార‌ని వారి పేర్ల‌ను రివీల్ చేయ‌డంతో అది కాస్తా హాట్ టాపిక్ అయ్యింది. హాలీవుడ్ స్టార్ల రాక‌తో పాన్ ఇండియా అప్పీల్ మ‌రింత‌గా పెరిగింది ఆర్.ఆర్.ఆర్ కి. ఇక ఆ వివ‌రాల‌తో పాటే ప‌ది భాష‌ల్లో ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నామ‌ని ఓ హింట్ ఇచ్చింది చిత్ర‌బృందం. పైగా ఇన్ని భాష‌లు అంటూనే రిలీజ్ తేదీ పైనా క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో డౌట్స్ డ‌బుల్ అయ్యాయి.

అందుకే ఆ రెండు పాయింట్లు ఇప్పుడు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తున్నాయి. తెలుగు-త‌మిళం-క‌న్న‌డం-మ‌ల‌యాళం కాకుండా హిందీలోనూ ఆర్.ఆర్.ఆర్ అత్యంత భారీగా రిలీజ‌వుతుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే మిగ‌తా ఐదు భాష‌లేవి? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది. అందుకు సంబంధించి జ‌క్క‌న్న అండ్ టీమ్ ఏ క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆ ఐదు భాష‌లేవో అభిమానులే గెస్ చేస్తున్నారు. వీటిలో ఒక‌టి జ‌ప‌నీ భాష‌.. ఇంకొక‌టి చైనా భాష అన‌డంలో సందేహం లేదు. అలాగే కొరియా- మ‌లేషియా లాంటి చోట్లా లోక‌ల్ భాష‌ల్లో రిలీజ్ చేసే వీలుంటుంది. ఇక ఇంగ్లీష్ టైటిల్స్ కూడా వేస్తారు.. మొరాకో జార్జియా స‌హా ఐరోపా దేశాల్లోనూ ఈ చిత్రాన్ని లోక‌ల్ భాష‌ల్లోకి అనువ‌దించి రిలీజ్ చేస్తారా? అన్న‌ది చూడాలి.


Tags:    

Similar News