కబాలీశ్వరన్ ఎలియాస్ కబాలి అంటూ ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ పేరును పెట్టారనే సంగతి తెలిసిందే. అయితే ఈ పేరు పెట్టడం వెనుక చాలా స్టోరీయే ఉంది.
పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడు ఒకనాడు శివుడ్ని కైలాస పర్వతం వద్ద కలసుకున్నప్పుడు.. ఆ నీలకంఠుడి గొప్పదనాన్ని అస్సలు కొనియాడలేదట. బ్రహ్మ ప్రవర్తనతో కోపం రావడంతో.. సృష్టి కర్త యొక్క నాలుగు తలల్లో ఒక తలని తుంచేసి విసిరేశాడట శివుడు. ఆ తల దక్షిణ భారతదేశంలోని ఒక ప్రాంతంలో పడిందట. తప్పు తెలుసుకున్న బ్రహ్మదేవుడు తన తల పడిన చోటనే ఒక శివలింగాన్ని ప్రతిష్టించాడు. ఇదంతా కలలో రావడంతో అప్పట్లో 5వ శతాబ్దంలో పల్లవ రాజులు అక్కడ ''కపాలీశ్వరన్'' అనే ఆలయాన్ని నిర్మించారు. కపాలం అంటే తల అని వేరే చెప్పక్కర్లేదుగా. ఆ తరువాత అక్కడున్న ఒరిజినల్ గుడిని పోర్చుగీసు వారు 16వ శతాబ్దంలో ధ్వంసం చేయగా.. దానిని మరో చోట విజయనగర రాజులు కట్టడం జరిగిందని స్థల పురాణం చెబుతోంది. ఆ గుడి ఇప్పుడు చెన్నయ్ కు శివార్లలోని మైలాపూర్ ఏరియాలో ఉంది.
ఇదంతా ఒకెత్తయితే.. మొదటి నుండీ శివ భక్తుడైన రజనీకాంత్.. తన సినిమాలకు అరుణాచలం - లింగా అంటూ శివుని పేర్లు పెట్టడం మనకు తెలిసిందే. అందుకే ఈసారి అలాంటి శివుని పేర్లలో ఒకదాన్ని వెతికి.. అందులో కొత్తగా ఉన్న పేరును చూసుకుని.. ''కబాలి'' అని పెట్టుంటారు.