ఇది మా మోర కాదు. తాజా ఫోటో షూట్స్ లో పూర్తిగా సన్నబడిన రకుల్ ప్రీత్ సింగ్ ని చూసి ఫాన్స్ అంటున్న మాట. తెలుగులో అగ్ర హీరోలందరి సరసన సినిమాలు చేసి టాప్ చైర్ ని ఎంజాయ్ చేసిన రకుల్ ఈ మధ్య బాగా స్లో అయిపోయింది. జయ జానకి నాయకి సినిమా తర్వాత ఇక దేంట్లోనూ కనిపించలేదు. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడం - తన పాత్ర సెకండ్ హాఫ్ మొత్తం డీ గ్లామర్ తరహాలో కనిపించడం మైనస్ గా మారింది. దానికి తోడు టాలీవుడ్ లో కొత్త హీరొయిన్లు - మలయాళం బ్యూటీల ఎంట్రీ మహ జోరుగా ఉంది. ఈ నేపధ్యంలో ఇక్కడ కొంచెం రిస్క్ అని భావించింది కాబోలు బాలీవుడ్ వైపు తన మొదటి అడుగులు వేసేసింది రకుల్. తన మొదటి సినిమా అయారి ఫిబ్రవరి 9న విడుదల కానుంది.
సిద్దార్థ్ మల్హోత్రాకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రాధాన్యం ఉన్న పాత్రే పోషించినట్టు ట్రైలర్ ను బట్టి అర్థమయ్యింది. అంతా బాగానే ఉంది కాని ఇప్పుడు ఉన్నట్టుంది ఇంకా బరువు తగ్గి నాజూకుగా మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అభిమానులకు అర్థం కావడం లేదు. ఇప్పుడు డిమాండ్ ఉన్న హీరొయిన్లను ఎవరిని తీసుకున్నా మరీ కరెంట్ తీగంత సన్నగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. సో పోటీ కోసమైతే కాదు. ఇంకే సినిమా కోసమైనా పాత్ర డిమాండ్ మేరకు బరువు తగ్గుతోందా అనేది మాత్రం బయటికి చెప్పలేదు.
ఇలా నాజూగ్గా మారడానికి రకుల్ ప్రీత్ సింగ్ ప్రత్యేకంగా జిమ్ లో కోచింగ్ కూడా తీసుకుందట. బాడీ సంగతి ఏమో కాని అవసరానికి మించి ఒళ్ళు తగ్గడం మొహం మీద కూడా ప్రభావం చూపించి కొంత పీలగా మారింది. ఇలా మాత్రం వద్దు, మమూలుగా బూరెల్లాంటి బుగ్గలతో చక్కని బాడీ షేపింగ్ ఉన్న పాత రకుల్ లా ఉంటే చాలని ఫాన్స్ కోరుతున్నారు. మరి ఇది రకుల్ దాకా చేరి మునపటి గ్లో - చార్మ్ తో హల్చల్ చేయాలని అభిమానుల కోరిక. రకుల్ నటించిన అయారి మూవీకి దర్శకుడు నీరజ్ పాండే.