ఇటీవలే మొదలైన రామ్ చరణ్-బోయపాటి శీను సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది అనే వార్త వినగానే అందరూ షాక్. అదేంటి చెర్రి ఇంకా రంగస్థలం షూటింగ్ లో ఉండగా ఇక్కడ ఫస్ట్ షెడ్యూల్ ఎలా పూర్తి చేసారా అని అందరికి అనుమానం వచ్చింది. నిజానికి చరణ్ ఈ షెడ్యూల్ లో మాత్రమే అందుబాటులో లేడట. అందువల్ల తన కాంబినేషన్ సీన్లు లేని ఇతర ఆర్టిస్టులతో తీసేసి చైల్డ్ ఎపిసోడ్ కూడా పూర్తి చేసినట్టు తెలిసింది. రంగస్థలంలో పూజా హెగ్డే తో చేయాల్సిన ఐటెం సాంగ్ ఇంకా హైదరాబాద్ లో షూట్ చేయాల్సి ఉంది. దానితో మొత్తం షూటింగ్ పూర్తయిపోతుంది. తర్వాత బోయపాటి శీను సినిమా కోసం గెడ్డం తీసేసి కొత్త గెటప్ లోకి మారతాడు చెర్రి. ఇదంతా ముదస్తు ప్లానింగ్ ప్రకారమే జరిగిందని, చరణ్ ముదుగానే బోయపాటి శీనుకి చెప్పి ఫిబ్రవరిలో తన కాల్ షీట్స్ ప్లాన్ చేయమని చెప్పాడట.
ఇందులో నిజమెంతున్నా చరణ్ ప్లానింగ్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. రంగస్థలం గత ఏడాది దసరాకు విడుదల ప్లాన్ చేసి షూటింగ్ మొదలు పెట్టారు. కానీ సంక్రాంతికి కూడా సిద్ధం చేయలేకపోయారు. దానికి తోడు సుకుమార్ కొంత భాగం రీ షూట్ చేయాలనీ కోరడంతో క్వాలిటీ కోసం రాజీ పడకుండా రామ్ చరణ్ కూడా అదనంగా డేట్స్ ఇచ్చాడనే టాక్ కూడా ఉంది. రీ షూట్ కు కారణం మాత్రం బయటపడనివ్వలేదు. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు జరిగే సింగల్ షెడ్యూల్ లో పాటతో సహా మొత్తం షూటింగ్ పూర్తయిపోతుంది. దాని తర్వాత గ్యాప్ ఇవ్వకుండా రామ్ చరణ్ బోయపాటి శీను తో జత కడతాడు.
రంగస్థలం తరహాలోనే బోయపాటి శీను సినిమా మీద కూడా పలు కథనాలు వెలువడుతున్నాయి. రాజస్తాన్ బ్యాక్ డ్రాప్ లో టూ షేడ్స్ ఉన్న పాత్ర చరణ్ చేస్తున్నాడని రాజవంశస్తుడిగా ఒకటి, అల్లరి చేసే దొంగ పాత్రలో మరొకటి ఉంటాయనే టాక్ ఉంది. ఇది నిజమనే ఆధారాలు ఏమి లేవు కాని బోయపాటి దీన్ని తన స్టైల్ ఎమోషన్స్ మిక్స్ చేస్తూనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీయబోతున్నట్టు టాక్. కైరా అద్వాని చరణ్ కు జోడిగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు.