బాలయ్య వందో సినిమా ఎవరి దర్శకత్వంలో చేస్తాడనేది తెలిసిపోయింది కానీ... ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారనేది మాత్రం మొన్నటి వరకు సస్పెన్స్ వుండేది. దీనిని దర్శకుడు క్రిష్... తన సొంత బ్యానర్లో నిర్మిస్తానని బాలయ్యకు చెప్పాడట. దాంతో ఆయనకే ఈ చిత్ర నిర్మాణాన్ని అప్పజెప్పాడట. అయితే ముందుగా అనుకున్న ప్రకారం తన వందో సినిమాను వారాహి... 14 రీల్స్ సంస్థలకు ఇవ్వాలని అనుకున్నాడు బాలయ్య. అది కూడా బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమాను చేయాలనేది వీరి ప్లాన్. అయితే బోయపాటి శ్రీను ‘సరైనోడు’తో లాక్ అయిపోవడం... దీని తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయాల్సివుండటంతో... ఇక ఈ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా చాలా ఆలస్యం కానుంది. అయితే వందో సినిమాకు బోయపాటి కాకుండా... కృష్ణ వంశీ కూడా లైన్లోకి వచ్చాడు. మరి ఏమైందో తెలియదు కానీ.. దర్శకుడు క్రిష్.. బాలయ్య వందో సినిమా ప్రాజెక్టను దక్కించుకున్నాడు.
‘గౌమిపుత్ర శాతకర్ణి’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కనున్న ఈ చిత్రం ఉగాది పర్వదినాన ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా బడ్జెట్టు అన్ లిమిటెడ్ కావడం వల్ల తనకు ఫ్రీ హ్యాండ్ వుండటం కోసం.. ఈ ప్రాజెక్ట్ ను ఇతర నిర్మాతలతో చేయడం కంటే.. తనే ఈ చిత్రాన్ని నిర్మిస్తానని క్రిష్.. బాలయ్యను కోరారట. దాంతో ఎలాగూ బోయపాటితో తరువాత వుంటుంది కాబట్టి... నిర్మాత సాయిని పిలిపించి.. మీతో నెక్ట్స్ ప్రాజెక్టు చేస్తా. వందో సినిమాను డైరెక్టర్ క్రిష్.. తన సొంత బ్యానర్లో నిర్మిస్తానని అంటున్నాడని బాలయ్య చెప్పడంతో సాయి ఒకే అన్నాడట. ‘ఈ చిత్రం బడ్జెట్టు అన్ లిమిటెడ్ కావున.. దర్శకుడు తనకు ఫ్రీ హ్యాండ్ కావాలన్నాడు. అందుకే ఈ చిత్రాన్ని అతనికే అప్పజెబుదాం.. మీరు 101వ చిత్రాన్ని మోక్షుతో కలిసి చేద్దురు గానీ’ అన్నాడట. దాంతో నిర్మాత సాయి కొర్రపాటి వందో సినిమా ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని బాలయ్య సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.