ఆ వ్యామోహమే శ్రీదేవిని ఇలా చేసిందా?

Update: 2018-02-25 23:44 GMT
సీనియర్ నటుడు శోభన్ బాబు చివరగా ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ సినిమాలో నటించారు. అప్పటికే ఆయనలో అంతకుముందున్న గ్లో పోయింది. ఈ విషయంలో ప్రేక్షకుల అభిప్రాయాలు విన్నారో ఏమో.. ఆ తర్వాత ఆయన మళ్లీ నటించడానికి అంగీకరించలేదు. ఎంతమంది అడిగినా.. ఎంత పారితోషకం ఆఫర్ చేసినా శోభన్ బాబు నటించడానికి ఒప్పుకోలేదు. ఇందుకు కారణమేంటో కూడా ఆయన చెప్పారు. తనను అందరూ ఒక అందగాడిగానే గుర్తుంచుకుంటారని.. మునుపటి అందం కోల్పోయిన తాను కెమెరా ముందుకు రాలేనని.. అందుకే సినిమాల్లో నటించట్లేదని చెప్పారు. సినిమాల్లో నటించకపోవడమే కాదు.. కనీసం ఏ సినిమా వేడుకలో కానీ.. మరే కార్యక్రమంలో కానీ శోభన్ బాబు కనిపించలేదు. కొందరు సినీ తారల మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఉదాహరణ.

వయసు మీద పడ్డా అందంగానే కనిపించాలని తపించే వాళ్ల సంఖ్య ఇండస్ట్రీలో ఎక్కువగానే ఉంటుంది. తమకు వయసు మీద పడిందని.. వయసుతో పాటే వచ్చే మార్పులు సహజమని అంగీకరించడానికి చాలామంది సినీ తారలు ఒప్పుకోరు. శ్రీదేవి కూడా ఆ కోవకు చెందిన నటే అని చెప్పాలి. పెళ్లి చేసుకుని సినిమాల నుంచి నిష్క్రమించాక.. ఇద్దరు పిల్లల తల్లి అయ్యాక.. వాళ్లు టీనేజీలోకి వచ్చాక కూడా శ్రీదేవి మనస్తత్వం మారలేదు. ఎప్పటికీ తాను అతిలోక సుందరిగానే ఉండిపోవాలన్న తపించింది. అందుకోసమే రకరకాల సర్జరీలు చేయించుకుంది. సినీ రంగంలో ఉండగానే బరువు తగ్గేందుకు.. ముక్కు తీరు మార్చుకునేందుకు.. బుగ్గల్ని మరింత ఆకర్షణీయంగా మార్చుకునేందుకు సర్జరీలకు వెళ్లింది శ్రీదేవి. ఎద సౌందర్యం పెంచుకునేందుకు కూడా శ్రీదేవి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే.

ఇక కొన్నేళ్ల కిందట సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక కూడా శ్రీదేవికి ఈ వ్యామోహం తగ్గలేదనే చెప్పాలి. మళ్లీ ఆమె ఒంటికి కొన్ని సర్జరీలు జరిగాయని.. ఆమె అందం కాపాడుకునేందుకు నిరంతరం మందులు వాడుతూనే ఉందని.. చికిత్సలు కూడా చేయించుకుంటూనే ఉందని.. అవే ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉంటాయని కొంత మంది  అంటున్నారు. ఈ తరం హీరోయిన్లు దీటుగా శ్రీదేవి ఈ వయసులోనూ ఫొటో షూట్లు చేయడం.. ఫ్యాషన్ షోల్లో పాల్గొనడం చేసింది. వాటికి సంబంధించిన ఫొటోలు.. వీడియోల గురించి జనాలు కామెంట్లు పెడుతూ.. ఇప్పటికీ ఆమెను అతిలోక సుందరిగానే అభివర్ణించడం.. అవి చూసి శ్రీదేవి పొంగిపోయి ఆ రకమైన ట్రాన్స్ లోనే ఉండటం జరిగిందని.. అందుకే ఆమె ఆరోగ్యం దెబ్బ తింటున్నప్పటికీ అందంపై శ్రద్ధ తగ్గించుకోలేదని.. చికిత్సలు - మందుల వాడకం కొనసాగించిందని.. ఈ క్రమంలోనే గుండెపోటుకు గురి కావాల్సి వచ్చిందని కొంత మంది అంటున్నాయి.
Tags:    

Similar News