తమన్నా ఎక్కడుంది నానా??

Update: 2017-04-26 09:38 GMT
ఇప్పుడు బాహుబలి 2 సినిమా కోసం ఎటు చూసినా కూడా తెగ ప్రమోషన్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాజమౌళి అండ్ టీమ్ నేషనల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. అయితే 1వ పార్టు సక్సెస్ అవ్వడంతో అవంతిక పాత్రతో పచ్చబొట్లు వేయించుకుని తన వంతు సహకారం అందించిన మిల్కీ సైరన్ తమన్నా బాటియా ఇప్పుడు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటారు?

దాదాపు రెండు మూడుసార్లు తప్పిస్తే అసలు తమన్నా ఎక్కడా కూడా కనిపించలేదు. ఏదో ఆడియో ఫంక్షన్లకు వచ్చిందికాని.. తరువాత ఇంటర్యూలో పెద్దగా కనపడబలేదు. అసలు విషయం ఏంటంటే.. 2వ భాగంలో అసలు తమన్నా క్యారక్టర్ ఏదీ లేదట. ఏదో కాస్త క్లయమ్యాక్సులో కనిపించడం తప్పిస్తే.. అసలు తమన్నా స్ర్కీన్ టైమ్ లేదట. అందుకే ఇప్పుడు తమన్నా వచ్చి ప్రమోట్ చేస్తే రేపు సినిమా రిలీజయ్యాక నెగెటివ్ టాక్ వచ్చే స్కోప్ ఉందని రాజమౌళి వద్దన్నట్లు తెలుస్తోంది.

అయితే చెప్పడానికి తమన్నా మాత్రం చెన్నయ్ లో విక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా అంటోంది. నిన్నటి నుండి కొత్త షెడ్యూల్ బెంగుళూరులో మొదలైనట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News