మొన్న ‘హోరా హోరీ’ ఆడియో ఫంక్షన్లో డైరెక్టర్ తేజ వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయాయి. తేజ చాలా ఫ్రాంక్ గా మాట్లాడతాడన్న సంగతి తెలిసిందే. కానీ మొన్న మరీ ఓపెన్ గా మాట్లాడేశాడు. టాలీవుడ్ లో గత పదేళ్లలో రెండే రెండు కథలతో సినిమాలు వస్తున్నాయని.. తాను మాత్రం ఏ సినిమా తీసినా ‘జయం’తో పోలిక పెడుతుండటం చిరాకు తెప్పిస్తోందని తేజ చాలా ఆవేశంగానే మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తేజ.
గత పదేళ్లలో తన సినిమాలు సరిగా ఆడకపోవడానికి కారణమేంటో తనకు తెలిసిందని చెప్పాడు తేజ. తనకు కోపం ఎక్కువని.. చాలా అగ్రెసివ్ గా ఉంటానని.. జనాలు పదే పదే దీని మీద కంప్లైంట్లు చేయడంతో తనను తాను మార్చుకునే ప్రయత్నం చేశానని.. అందులో భాగంగా శాంత స్వభావుడిగా మారానని అదే తనను దెబ్బతీసిందని అన్నాడు తేజ. అగ్రెసివ్ నెస్ తగ్గించేయడంతో తన సినిమాల మీద కూడా ఆ ప్రభావం పడిందని.. అందుకే వరుసగా ఫెయిల్యూర్స్ వచ్చాయని.. ఐతే తన అగ్రెసివ్ నెసే తన బలం అని గ్రహించి.. ఇప్పుడు మళ్లీ తనదైన శైలిలో ‘హోరాహోరీ’ తీశానని చెప్పాడు తేజ.
హోరాహోరీ సినిమా ట్రైలర్ చూశాక కూడా చాలామంది జయంలా ఉంది అంటున్నారని.. ఐతే జయం తీసింది తానే కాబట్టి.. తన ముద్ర ఈ సినిమాలో కూడా కనిపించవచ్చని కానీ.. సినిమా భిన్నంగా ఉంటుందని.. ఈసారి కచ్చితంగా తన అభిమానుల్ని ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని హామీ ఇచ్చాడు తేజ.