కామ్రేడ్ నిర్ణయం వెనుక స్ట్రాటజీ ఇదే!

Update: 2019-05-28 06:58 GMT
ముందే చేసుకున్న ప్లానింగ్ ప్రకారం అయితే విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ఈ శుక్రవారం విడుదల కావాలి. అనూహ్యంగా జూలైకు పోస్ట్ పోన్ చేస్తూ కొద్దిరోజుల క్రితం ప్రకటించడం ఫ్యాన్స్ ని నిరాశ పరిచినా ఒకరకంగా చూస్తే ఇప్పుడు ఆ నిర్ణయమే మంచిదని అర్థమవుతోంది. ఒకపక్క రాష్ట్రంలో విపరీతమైన ఎండలు. దీని ప్రభావం నేరుగా నూన్ మ్యాట్నీ షోలపై పడుతోందని మందగించిన వసూళ్లు చెబుతున్నాయి.

ఇంకో పది రోజుల్లో వరల్డ్ కప్ ఫీవర్ స్టార్ట్ కాబోతోంది. ఇండియా హాట్ ఫెవరెట్ గా ఉంది కాబట్టి మన మ్యాచులే కాదు కీలకమైన వాటిని మనవాళ్ళు అన్ని మిస్ కాకుండా చూస్తారు. ఇది కూడా కలెక్షన్లపై ఎఫెక్ట్ చూపించే ఫ్యాక్టరే. ఒకవేళ నిజంగా డియర్ కామ్రేడ్ వచ్చి ఉంటే మరీ తీవ్రంగా కాకపోయినా ఎంతో కొంత ఫిగర్స్ లో తేడా వచ్చేది దానికి ఉదాహరణ ఈ ఫ్రైడే రానున్న సినిమాల గురించే చెప్పుకోవచ్చు.

సూర్య లాంటి స్టార్ హీరో సాయి పల్లవి రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్లు ఉన్నా ఎన్జికె పెద్దగా చప్పుడు చేయడం లేదు. ప్రభుదేవా తమన్నాల అభినేత్రి 2 విడుదలవుతోందన్న సంగతి కూడా తెలియనంత సైలెంట్ గా రిలీజ్ చేస్తున్నారు. సురేష్ సంస్థ అండదండలతో వస్తున్న ఫలక్ నుమాదాస్ యూత్ టార్గెట్ గా వస్తోంది. మిగిలిన సెక్షన్లు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పైన చెప్పిన కారణాల వల్ల ఆశించిన రేంజ్ లో ఇవి పబ్లిక్ అటెన్షన్ తీసుకోలేకపోతున్నాయి. డియర్ కామ్రేడ్ వచ్చి ఉంటే వీటిని సులభంగా ఓవర్ టేక్ చేసేది కానీ ఎండలతో పాటు వరల్డ్ కప్ ఫీవర్ ఎంతో కొంత దెబ్బ వేసేది. లేట్ అయినా జులైకి వెళ్ళిపోయి కామ్రేడ్ చాలా తెలివిగా వ్యవహరించాడు


Tags:    

Similar News