కాలు విరిగినందుకే వినాయక్‌ కలిసింది

Update: 2015-06-25 14:10 GMT
ఇటీవలి కాలంలో మెగాస్టార్‌ చిరంజీవి నటించే 150వ సినిమాకి సంబంధించి రకరకాల పుకార్లు శికారు చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుందని చరణ్‌ ప్రకటించినా.. లేదు వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే వినాయక్‌ చిరుని కలిసి కథ వినిపించారు. అన్నయ్య నుంచి పాజిటివ్‌ స్పందన వచ్చిందని వార్తలొచ్చాయి. అయితే ఇదేదీ నిజం కాదని తేలిపోయిందిప్పుడు.

అసలు వినాయక్‌ చిరుని కలవడానికి కారణం వేరే. ఇటీవలే చిరు కాలికి గాయం అయ్యింది. ఇంట్లో మెట్లు ఎక్కుతున్నప్పుడు కాలు స్లిప్పయ్యి కింద పడ్డారు. దాంతో కాలికి బలమైన గాయం తగిలింది. వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. వారం పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చిరుకి వైద్యులు సూచించారు. వినాయక్‌ చిరు ఇంటికి వెళ్లడానికి కారణం ఇదే. మెగాస్టార్‌ని పరామర్శించి, యోగక్షేమాల్ని తెలుసుకోవాలనే వినయ్‌ అన్నయ్యను కలిశారు తప్ప కథ వినిపించడానికి కాదు అని సన్నిహితులు సెలవిచ్చారు. వినయ్‌ ఇలా ఇంటికి వెళ్లాడో లేదో 150వ సినిమాకి లైన్‌లోకొచ్చాడన్న పుకారు పుట్టేసిందని అంటున్నారు. అదీ సంగతి.

Tags:    

Similar News