నాగ్‌ బ్రహ్మాస్త్ర కి కమిట్ అవ్వడానికి కారణం..!

Update: 2022-08-24 23:30 GMT
బాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బ్రహ్మాస్త్ర పార్ట్‌ 1 శివ సినిమా సెప్టెంబర్‌ 9వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ను సౌత్‌ భాషల్లో టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి సమర్పిస్తున్న నేపథ్యంలో అక్కడనే కాకుండా ఇక్కడ కూడా భారీ ఎత్తున అంచనాలున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ జోరు పెంచారు.

బ్రహ్మాస్త్ర సినిమా విడుదల నేపథ్యంలో తాజాగా చెన్నై లో భారీ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు సమర్పకుడు అయిన రాజమౌళి ఈ ప్రెస్ మీట్‌ లో పాల్గొన్నాడు.

రాజమౌళి ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు రజినీకాంత్‌ తో సినిమా చేయాలని ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా నాగార్జున మాట్లాడుతూ ఈ సినిమాను కమిట్‌ అవ్వడంకు కారణం ను తెలియజేశాడు.

ఈ సినిమా కథ భారతీయ పురాణ ఇతిహాసాల నేపథ్యంలో సాగుతుంది కనుక  కథ విన్న వెంటనే ఓకే చెప్పాను అన్నాడు. నాగార్జున ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా సినిమా ట్రైలర్‌ మరియు ప్రమోషనల్ వీడియోలు చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. దర్శకుడు అయాన్ కథను తయారు చేసిన విధానం నచ్చిందని నాగార్జున అన్నాడు.

రణబీర్ కపూర్‌ హీరోగా నటించిన ఈ సినిమా లో ఆలియా భట్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. అమితాబచ్చన్ మరియు ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. పార్ట్‌ 1 వచ్చే నెలలో విడుదల అయిన వెంటనే పార్ట్‌ 2 కి సంబంధించిన విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. సౌత్‌ లో బ్రహ్మాస్త్ర సాధించబోతున్న వసూళ్లపై అందరి దృష్టి ఉంది.

Tags:    

Similar News