ప్రభాస్ ఆ రీమేక్ చేస్తే బాగుంటుంది: కృష్ణంరాజు

Update: 2022-03-13 03:43 GMT
వయసు పై బడటం వలన .. అనారోగ్య సమస్యల వలన కృష్ణంరాజు చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్నారు. ప్రభాస్ హీరోగా  నిర్మితమయ్యే సినిమాల్లో మాత్రమే అడపా దడపా కనిపిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన 'రాధే శ్యామ్' సినిమాలోను నటించారు.

ఈ సినిమా నిర్మాణంలో కృష్ణంరాజు సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ భాగస్వామ్యం కూడా ఉంది. ఈ సినిమాతో కృష్ణంరాజు పెద్ద కూతురు 'ప్రసీద' నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ నెల 11వ తేదీన 'రాధే శ్యామ్'  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే 79 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో కృష్ణంరాజు మాట్లాడుతూ .. "ఈ సినిమా నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నేను ప్రభాస్ కలిసి ఇంతకుముందు నటించాము. ఈ సారి మా అమ్మాయి ప్రసీద కూడా ఇందులో భాగస్వామి కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను 'పరమహంస' పాత్రలో కనిపిస్తాను.

ఈ పాత్రను చూస్తే వివేకానందుడు .. రామకృష్ణ పరమహంస మాదిరిగా అనిపిస్తుంది. అంతటి నిండుదనం ఉన్న పాత్రను చేయడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఆ పాత్రను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాను.

'పరమహంస' పాత్రలో నన్ను చూస్తే దేవుడిని చూసినట్టుగా ఉందని ప్రభాస్ ఒక ఇంటార్వ్యూలో చెప్పాడు. నిజంగా అది నాకు దక్కిన పెద్ద కాంప్లిమెంట్ గా నేను భావిస్తున్నాను. ప్రభాస్ కెరియర్ అంచనాలను దాటుకుని వెళుతోంది. అయితే రెండు మూడేళ్లకు ఒక సినిమానే చేస్తున్నాడని అభిమానులు అసంతృప్తి చెందుతున్నారు.

'రాధేశ్యామ్' కూడా ఇంత ఆలస్యమై ఉండేది కాదు. కరోనా ప్రభావం వలన కలిగిన ఆటంకాల వలన ప్రేక్షకుల ముందుకు రావడానికికి చాలా సమయం పట్టేసింది. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు థియేటర్లకు తీసుకొచ్చే ఆలోచనలోనే ప్రభాస్ ఉన్నాడు.

నా సినిమాల్లో నాకు నచ్చిన సినిమా ఏదంటే 'మనవూరి పాండవులు' అని చెబుతాను. ఆ కథ ఈ కాలానికి కూడా సరిగ్గా సరిపోతుంది. నా సినిమాల్లో ప్రభాస్ ఏది రీమేక్ చేస్తే బాగుంటుందని అడిగితే, 'మనవూరి పాండవులు' అనే చెబుతాను. ఇక ప్రభాస్ చేసిన సినిమాలు చాలావరకూ మంచి విజయాలను సాధించాయి.

ఆ సినిమాలన్నిటిలో 'వర్షం' సినిమా అంటే నాకు బాగా ఇష్టం. ఆ పాత్రను అర్థం చేసుకుని ప్రభాస్ చేసిన తీరు నాకు బాగా నచ్చింది. 'రాధేశ్యామ్' కూడా అలాంటి ఒక రొమాంటిక్ లవ్ స్టోరీనే కావడం .. ప్రేక్షకులు ఆదరిస్తుండటం ఆనందాన్ని కలిగిస్తోంది" అని చెప్పుకొచ్చారు.     
Tags:    

Similar News