ప్రభాస్ కథానాయకుడిగా రెబల్ స్టార్ కృష్ణంరాజు 'ఒక్క అడుగు 'చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తన గోపీకృష్ణ మూవీస్ పై సోలోగా నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోన్న సంగత తెలిసిందే. 'బాహుబలి' సినిమా ప్రారంభం ముందు నుంచి ఒక్క అడుగు ప్రాజెక్ట్ వినిపిస్తోంది. కానీ ఇప్పటివరకూ ఈ చిత్రం పట్టాలెక్కింది లేదు.
ప్రభాస్ వేరే వేరు సినిమాలకు కాల్షీట్లు కేటాయిస్తున్నారు తప్ప! 'ఒక్క అడుగు'కి మాత్రం కేటాయించలేదని తర్వాత పరిణామాలే చెప్పాయి. నాలుగేళ్ల క్రితం కృష్ణంరాజు బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గురించి పెద్దాయన డీటైల్స్ వెల్లడించారు.
ప్రభాస్ కటౌట్ కు అదిరిపోయే స్ర్కిప్ట్ అని...చక్కని సందేశంతో కూడుకున్న సినిమా అవుతుందని...ఒక్క అడుగు వేయి అడుగుల పడేలా ఇన్ స్పైర్ చేసే స్ర్కిప్ట్ అని చెప్పారు. కృష్ణం రాజు స్వయంగా ఈ కథను సిద్దం చేసుకున్నట్లు కూడా వెల్లడించారు. ఆ సందర్భంలో మీరే డైరెక్ట్ చేయోచ్చు కదాని ప్రశ్నించగా? అది నేను చేయాల్సిన సినిమా కాదు...పూరి జగన్నాథ్ లాంటి వాళ్లు చేయాల్సిన పవర్ పుల్ స్ర్కిప్ట్ అని పరోక్షంగా పూరి పేరు రివీల్ చేసారు.
మంచి డైరెక్టర్ ప్రభాస్ వెసులుబాటు దొరకగానే సెట్స్ కు వెళ్తుందని పెద్దయన చెప్పారు. కానీ ఇప్పటివరకూ ఆ ప్రాజెక్ట్ కార్య రూపం దాల్చలేదు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ 'సాహో' చేసారు. ఆతర్వాత నటించిన 'రాధేశ్యామ్' కూడా ఇటీవలే రిలీజ్ అయింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' అనే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు.
ఇది పాన్ ఇండియా కేటగిరి సినిమా. మరి ఇలాంటి సందర్భంలో 'ఒక్క అడుగు' పడటానికి ఆస్కారం ఉందా? మళ్లీ టాలీవుడ్ లో ఒక్క అడుగు కదలికలు మొదలయ్యాయా? అంటే అవుననే టాక్ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది. ఇటీవలే 'ఒక్క అడుగు' చిత్రం గురించి మరోసారి కృష్ణంరాజు అబ్బాయ్ వద్ద చర్చించారుట.
అందుకు ప్రభాస్ తప్పకుండా చేద్దామని మరోసారి ప్రామిస్ చేసినట్లు గుస గుస వినిపిస్తుంది. దర్శకుడు పేరు కూడా తెరపైకి వస్తోంది. ముందు వరుసలో పూరి పేరు ఉండగా..అటుపై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పేరు సెకెండ్ ఆప్షన్ గా కనిపిస్తుందని సమాచారం. అయితే ఇక్కడ డార్లింగ్ ఫైనల్ డెసిషన్ తీసుకోవడమే అంతిమంగా బ్యాలెన్స్ అని చెప్పాలి.
పూరి-డార్లింగ్ ర్యాపో గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ ఫేమస్ డైరెక్టర్ పూరి. అతని మేకింగ్ అంటే ప్రభాస్ కి ఎంతో ఇష్టం. అంతకు మించి అంతని లో గొప్ప రైటర్ ని ఎంతో ఇష్టపడతారు. హీరో పాత్రని పూరి డిజైన్ చేసినట్లు గా ఇంకే మేకర్ రాయలేడని బలంగా చెప్పే హీరోల్లో డార్లింగ్ ముందుంటారు. ఇటీవలే మరోసారి పూరి పై తనకున్న అభిమానాన్నిసైతం చాటుకున్నారు.
పూరి తో సినిమా చేసి చాలా కాలమవుతోందని...తనతో మంచి ఎంటర్ టైనింగ్ సినిమా చేసి రీఫ్రెష్ అవ్వాలని ఆ మధ్య ఓ ఇంటర్వూలో ప్రభాస్ అన్నారు. ఆ ప్రాజెక్ట్ 'ఒక్క అడుగు' ఎందుకు అవ్వకూడదు. అయితే ఇక్కడ చిన్న మతలబు ఉంది. పూరి ఇతర రైటర్ల కథల్ని తీసుకున్న సందర్భం లేదు. రీమేక్ లు కూడా చాలా అరుదు. అయితే ఇక్కడ కథ రాసింది రెబల్ స్టార్ కాబట్టి పూరి టేకప్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది.