త్రిష దశాబ్ద కాలంగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. ఇప్పటికీ తెలుగులో నమస్కారం అనడం కూడా సరిగా రాదు. ఆమె కంటే ముందు కూడా చాలామంది పరభాషా హీరోయిన్లది అదే వరస. కానీ ఈ తరం హీరోయిన్లు అలా లేరు. తమన్నా - సమంత లాంటి హీరోయిన్లు అచ్చ తెలుగు హీరోయిన్లలా మన భాష మాట్లాడేస్తారు. వీళ్లు మొదలుపెట్టిన ట్రెండును రెజీనా - రకుల్ లాంటి వాళ్లు కూడా కొనసాగిస్తున్నారు. రెజీనా అయితే ఫ్లూయెంటుగా తెలుగు మాట్లాడేస్తోంది. మరి తక్కువ టైంలో ఇంత బాగా తెలుగు మాట్లాడేయడానికి ఏం చేశారేంటి అని అడిగితే.. అంతా డైరెక్టర్ మారుతి పుణ్యమే అంటోంది రెజీనా.
కొత్త జంట సినిమా చేయడానికి ముందే తెలుగు విషయంలో మారుతి తనకెంతో సాయం చేశాడని చెబుతోంది రెజీనా. ‘‘మారుతితో నేను కొత్తజంట సినిమా చేయడానికి ముందే పరిచయం. నా తొలి సినిమా ‘ఎస్ ఎంఎస్’ చేస్తున్నపుడే ఆయన నాకు డైలాగ్ డెలివరీ విషయంలో చాలా సాయం చేశారు. ఏ పదం ఎలా పలకాలో.. భాషలో ఇన్వాల్వ్ అయి డైలాగ్ ఎలా చెప్పాలో నేర్పించారు. అప్పట్నుంచీ అదే ఫాలో అయ్యా. కొత్త జంట సినిమా చేస్తున్నపుడు ఆయన దగ్గర్నుంచి ఇంకా చాలా నేర్చుకున్నా. అందుకే చాలా త్వరగా తెలుగు వచ్చేసింది నాకు’’ అని రెజీనా చెప్పింది. ఇంతకుముందే కొన్ని సినిమాలకు నేరుగా డబ్బింగ్ చెబుదామని చూశానని.. కానీ కుదర్లేదని.. త్వరలోనే కచ్చితంగా తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటానని రెజీనా చెప్పింది.