#చిరు150లో ఐటెం? నాకంత సీన్ లేదు

Update: 2016-07-01 07:30 GMT
మెగా 150 గురించి ఇప్పటికే బోలెడన్ని వార్తలు వచ్చాయి. అక్కడ కంప్లీట్ అయిన షూటింగ్ పార్ట్ కంటే.. ఇప్పటికే వచ్చిన రూమర్ స్టోరీలే ఎక్కువ. డైలాగ్స్ అనీ.. హీరోయిన్స్ అనీ.. ఐటెం సాంగ్ అనీ.. ఏవేవో వార్తలు కనిపిస్తూనే ఉన్నాయి. వీటన్నిటిలో మెగాస్టార్ పక్కన ఓ ఐటెం సాంగ్ లో రెజీనా డ్యాన్స్ చేయనుందనే న్యూస్ మాత్రం బాగా ఇంట్రెస్ట్ కలిగించింది. మరి రెజీనా లాంటి యంగ్ హీరోయిన్ మెగాస్టార్ పక్కన చిందులేస్తుంటే చూసేందుకు బాగానే ఉంటుంది కానీ.. అసలు సంగతి ఆమెనే అడిగేస్తే చెబుతుంది కదా.

'చిరంజీవి 150వ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతున్నానంటూ చాలానే రూమర్స్ వచ్చాయి. అసలు విషయం ఏంటంటే.. ఈ రోల్ కోసం ఇప్పటివరకూ నన్ను ఎవరూ సంప్రదించనే లేదు' అంటూ క్లారిటీ ఇచ్చిన కుర్ర భామ.. మరి ఆఫర్ వస్తే అనే ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇచ్చింది. 'నో.. నన్ను నేను ఐటెం సాంగ్స్ లో చూడాలని అనుకోవడం లేదు. నాకు డ్యాన్సులు అంటే ఇష్టమే కానీ.. నాకు ఐటెం గాళ్ గా మారాలనే కోరిక మాత్రం లేదు' అంటూ చెప్పుకొచ్చింది రెజీనా.

రెజీనా ఐటెంసాంగ్ చేయడం.. చేయకపోవడం సంగతి పక్కన పెడితే.. ఇప్పుడో విషయంపై మాత్రం క్లారిటీ వచ్చేసింది. చిరు పక్కన చిందులేసే సుందరాంగి ఈ కుర్ర హీరోయిన్ మాత్రం కాదు. అసలీమెకు ఆఫర్ కూడా రాలేదు. మరి మెగాస్టార్ పక్కన కనిపించే ఆ హీరోయిన్ ఎవరో.. ఈ ఐటెం గాళ్ ఎవరో.. అంతా నిర్మాత రామ్ చరణ్ కే తెలియాలి.
Tags:    

Similar News