హేమా మాలిని తరువాత రేఖ దండయాత్ర

Update: 2016-12-05 13:30 GMT
ఇప్పుడు ఇండియాలో ఉన్న సీనియర్ నటులందరి కన్నూ తెలుగు ఫిలిం ఇండస్ర్టీపైనే పడిందా అంటే అవుననే చెప్పాలి. మొన్నటికి మొన్న మోహన్ లాల్ జనతా గ్యారేజ్ తో వచ్చాడు. తరువాత డ్రీమ్ గాళ్‌ హేమా మాలిని గౌతమీపుత్ర శాతకర్ణితో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పుడు ఇదే బాటలో మరో బాలీవుడ్ సీనియర్ రేఖ కూడా రానుంది.

1966లో తెలుగు సినిమా 'రంగులరాట్నం'లో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ భానురేఖ మెరిసింది. కాలాంతరంలో ఆమె రేఖ అనే ఒక గార్జియస్ హీరోయిన్ గా బాలీవుడ్ లో దుమ్ముదులిపేసింది. ఈ రేఖ ఎవరో కాదు.. మన మహానటి సావిత్రి భర్త నటుడు జెమీనీ గణేశన్ రెండో భార్య కూతురు. ఇప్పుడు రాజ్యసభ ఎంపి అయిన 62 ఏళ్ళ రేఖ.. మరో ఎంపి అయిన హేమామాలిని తరహాలో ఒక తెలుగు సినిమాలో నటిస్తోంది. పూర్ణ (షామ్నా కాసిం) హీరోయిన్ గా రూపొందుతున్న ఒక సినిమాలో.. ఫ్లాష్‌ బ్యాక్ లో పూర్ణ కూతురిగా రేఖ కనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ లో తీయబడే ఈ ఎపిసోడ్ కోసం ఆల్రెడీ రేఖ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

విశేషం ఏంటంటే.. హేమ మాలిని కూడా ఎప్పుడో 1968లో తెలుగులో పాండవ వనవాసం సినిమాలో ఒక సైడ్ డ్యాన్సర్ గా నటించింది. ఇప్పుడు ఒకటే సంవత్సరంలో ఆమె మరియు రేఖ మళ్ళీ ఒకటే సంవత్సరంలో తెలుగు తెరపై దండయాత్ర చేయడం విశేషం.  


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News