జయపై పుకార్లు శోభన్ బాబు పుణ్యమేనా?

Update: 2016-12-12 09:47 GMT
యలలిత విప్లవనాయకి.. ప్రజల్లో ఆమె అంటే ఒక రేంజిలో అభిమానం ఉంది. కానీ... ఆమెపై పుకార్లూ అదే స్థాయిలో ఉన్నాయి. ఆమెకు, శోభన్ బాబుకు మధ్య రహస్య సంబంధం ఉందన్న ప్రచారం చాలాకాలంగా ఉంది. అయితే... దానికి ఆధారాలు ఎవరి వద్దా లేవు, కానీ, ఖండించేవారు మాత్రం ఉన్నారు. జయ అతనితో స్నేహంగా ఉన్నంత మాత్రాన ఏదో ఉందనుకుంటే ఎలా అనే వారూ ఉన్నారు. జయసుధ వంటి సీనియర్ తారలు ఇలాంటి ప్రచారమంతా తప్పని ఖండించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ... ఈ ఖండనల కంటే పుకార్లే ఎక్కువగా ప్రజలను చేరాయి.

    అయితే... జయపై ఇలాంటి వదంతులు రావడానికి శోభన్ బాబు కొంతవరకు కారణమయ్యారని అనేవారూ ఉన్నారు. ఆయన మనసులో దురుద్దేశం ఉందో లేదో తెలియదు కానీ జయతో తనకున్న పరిచయం, స్నేహాన్ని అతిగా వర్ణించడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చెబుతారు.

    నిజానికి జయలలిత బాగా పాపులర్‌ అయి సినీ పరిశ్రమలో వెలుగొందుతున్న రోజుల్లో శోభన్‌ బాబు పెద్ద స్టారేమీ కాదు.  ఆయన అదృష్టం కొద్ది ఎన్నో ఏళ్ల తరువాత జయలలితతో ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఒక సినిమా పత్రికలో శోభన్‌ బాబు తనతో నటించిన హీరోయిన్ల గురించి వ్యాసాలు రాశాడు.  ఒక్కో వారం ఒక్కొక్కరి గురించి రాసినా  జయలలిత దగ్గరకు వచ్చేసరికి మూడు వారాలపాటు ఆమెతో తన అనుబంధాన్ని గురించి బాగా ఎక్కువగా రాశారట.   మిగతా హీరోయిన్లతో తన అనుబంధాన్ని గురించి రాస్తూ వాళ్లు ఇద్దరూ స్టూడియోలో తీయించుకున్న ఫొటోలను ప్రచురిస్తే, జయలలిత దగ్గరకు వచ్చేసరికి ఆమె ఇంటికి వెళ్లినప్పుడు తీయించుకున్న ఫొటోలను ప్రచురించారు. శోభన్‌ బాబును ఇంట్లోకి ఆహ్వానిస్తున్న ఫొటో, భోజనం వడ్డిస్తున్న ఫొటో, ఆమె వీణ వాయిస్తుంటే ఈయన వింటున్న ఫొటో, శోభన్‌ బాబు వెళ్లిపోతుంటే జయలలిత బై చెబుతున్న ఫొటో ఇలాంటివన్ని ప్రచురించారు. ఇదంతా వారిద్దరి మధ్య ఏదో ఉందనుకునే భావన కలిగించిందంటారు.
Tags:    

Similar News