మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మూగ జీవాలంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లో ఖాళీ సమయాన్ని వాటితోనే గడుపుతారు. పెంపుడు గుర్రాలతో...పప్పీలతో ఆడుకోవడం ఓ హబీగా ట్రీట్ చేస్తారు. అప్పుడప్పుడు బాద్ షా గుర్రమెక్కి రైడ్ కి వెళ్తారు. వాటి ఆలనా పాలనా వీలున్నప్పుడల్లా స్వయంగా దగ్గరుండి చూసుకుంటారు. ఇక చరణ్ ఎక్కువగా ఇష్టపడే రైమ్ అనే కుక్క పిల్ల గురించైతే చెప్పాల్సిన పనిలేదు.
రైమ్ చరణ్ ప్రాణ సమానం. అతను ఎక్కడ ఉంటే రైమ్ అక్కడ ఉంటుంది. బ్రౌన్ కలర్ లో ఉండే ఈ విదేశీ బ్రీడ్ ని చరణ్ అంతగా ఇష్టపడతారు. ఆ మధ్య ఆర్ సీ 15 సెట్స్ లో రైమ్ కనిపిచిన సంగతి తెలిసిందే. హీరోయిన్ కియారా అద్వాణీ ఆన్ సెట్స్ లో ఖాళీ సమయంలో రైమ్ తో ఆడుకుంటోన్న ఫోటోలు లీక్ అయ్యాయి. తద్వారా పప్పీలు అంటే కియారికి ఎంత ఇష్టమో అర్ధమైంది.
తాజాగా రైమ్ చరణ్ ఒళ్లో రిలాక్స్ అవుతోన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అందులో రైమ్ ఒడిముగింట్లో కూర్చుని సేద తీరుతుంది. చరణ్ బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తుల్లో చాపర్ లో కూర్చుని కనిపిస్తున్నారు. చరణ్ 'ఆచార్య' ప్రమోషన్ కార్యక్రమాలు ముగించుకుని తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఇలా ఫోటో బయటకు వచ్చింది.
చరణ్ ఆ ఫోటోలో విండో నుంచి బయటకు చూస్తూ ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్నారు. అలా గాలిలో ప్రయాణం చేస్తుండగా తీసిన ఫోటోలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా అభిమానులు ఈ ఫోటోని షేర్ చేసి అభిమానం చాటుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' ఏప్రిల్ 29న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ సిద్ద అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రకు సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిలో భాగంగా 'ఆచార్య' ప్రచార కార్యక్రమాలకు ఇద్దరు హాజరవుతున్నారు. ఇక చరణ్ స్టార్ మేకర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ సెట్స్ లో ఉంది. చరణ్ 'ఆచార్య' ప్రమోషన్ కార్యక్రమాలు ఉండటంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. మళ్లీ రిలీజ్ అనంతరం షూట్ లో తిరిగి జాయిన్ కానున్నారు. 'ఆచార్య' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ-మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.