మహేష్ బాబు సినిమాల్లో నటించడమే కాకుండా పలు కార్పోరేట్ సంస్థలకు బ్రాండ్ అంబాజిడర్ గా కూడా పనిచేస్తున్నారు. సినిమా నిర్మాణం.. మల్టిప్లెక్సులు.. దుస్తుల బిజినెస్ లో కూడా ప్రవేశించారు. సినిమా నిర్మాణం విషయానికి వస్తే జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నారు. నిజానికి ఈ బ్యానర్ కు రిలయన్స్ వారు బ్యాకెండ్ నుంచి ఫండింగ్ ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
జియో రిలయన్స్ టీమ్ వారు మొదట తెలుగులో మహేష్ భాగస్వామ్యంతో ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ ను లాంచ్ చేద్దామని ప్లాన్ చేశారట. అయితే తెలుగులో ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు పెద్దగా ఊపు లేదు కాబట్టి ఆ ప్రాజెక్ట్ కోసం అనుకున్న ఫండ్స్ సినిమా నిర్మాణం వైపు మళ్ళించి GMB ఎంటర్టైన్మెంట్స్ పేరు మీద సినిమాలు చేస్తున్నారని సమాచారం. అయితే ఇందులో మహేష్ వాటా ఎంతో తెలియదు కానీ ఈ బ్యానర్ పై మీడియం బడ్జెట్ సినిమాలు తెరకెక్కించాలని మాత్రం ఫిక్స్ అయ్యారట.
రిలయన్స్ వారి బ్యాకప్ ఉంటుంది కాబట్టి ఈ బ్యానర్లో తెరకెక్కే సినిమాలను అవసరమైతే ప్యాన్-ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ బ్యానర్లో లాంగ్ టర్మ్ లో విజయవంతమైన సినిమాలు నిర్మించి నిలదొక్కుకోగలదా? ఇతర సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌసుల తరహాలో సత్తా చాటగలదా అనేది వేచి చూడాలి.