`ఓంకార`..`దేశీబోయ్స్` చిత్రాలు అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించాయో చెప్పాల్సిన పనిలేదు. అజయ్ దేవగణ్..కరీనా కపూర్..సైఫ్ అలీఖాన్..కొంకన్ సేన్...వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రల్లో విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన చిత్రం వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. క్రైమ్ థ్రిల్లర్ ఆద్యంతం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. దాదాపు రెండు దశాబ్ధాల క్రితం రిలీజ్ అయిన సినిమా ఇది.
తాజాగా ఇప్పుడీ సినిమాకి రీమేక్ చేసే ఆలోచనలో పడ్డారు మేకర్స్. నేటి జనరేషన్ కి తగ్గట్టు కథని సిద్దం చేసి ఓ సినిమా చేస్తే మంచి విజయం సాధించొచ్చు అన్న ధీమా మేకర్స్ లో కనిపిస్తుంది. అలాగే అక్షయ్ కుమార్..జాన్ అబ్రహం..దీపికా పదుకొణే నటించిన `దేశీబోయ్స్` కి సీక్వెల్ చేసే ఆలోచనలోనూ మేకర్స్ ఉన్నారు. రోహిత్ ధావన్ దర్శకత్వం వహించిన సినిమా బాక్సా ఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ సీక్వెల్ ని తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు చిత్రాల్ని ఆనంద్ పండిట్ నిర్మించడానికి ముందుకొస్తున్నారు. ఎరోస్ ఇంటర్నేషనల్..పరాగ్ సంఘ్వీలతో కలిసి ఈ చిత్రాల్ని నిర్మాంచాలని ప్లాన్ చయేస్తున్నారు. కొత్త తరాలకు ఈ రెండు చిత్రాల్ని చూపించాలి అన్న ఉద్దేశంతోనే రీమేక్...సీక్వెల్ గా తెరపైకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
ఇక బాలీవుడ్ లో రీమేక్..సీక్వెల్ ట్రెండ్ అనేది ఎప్పటి నుంచో ఉండనే ఉంది. 30 ఏళ్ల క్రితం నాటి సినిమాల్ని కూడా రీమేక్ చేస్తున్నారు. వాటికి మంచి సక్సెస్ రేట్ ఉండటంతో మేకర్స్ ఈ దిశగా అడుగులేస్తున్నారు. ఈ మధ్య కాలంలో పలు పాత చిత్రాల రీమేక్లు.. సీక్వెల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిదే ట్రెండ్ సౌత్ లోనూ మొదలవుతుంది. కోలీవుడ్ లో అయితే హాలీవుడ్ తరహాలో సినిమాటిక్ యూనివర్శ్ ని లోకేష్ కొనగరాజ్ లాంటి వారు పరిచయం చేసారు. ఇదే తరహాలో మరింత మంది మేకర్స్ ఆలోచన చేస్తున్నారు. టాలీవుడ్ లోనూ నవతరం మేకర్స్ దీనిపై సీరియస్ గానే వర్కౌట్ చేస్తున్నట్లు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.