‘పద్మావతి’లో అదొక్కటే డిజప్పాయింట్మెంట్

Update: 2018-01-24 10:38 GMT
తీవ్ర వివాదాలకు తెర తీసిన ‘పద్మావతి’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. బుధవారం ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు.. తమిళ.. మలయాళ భాషల్లోనూ రిలీజవ్వబోతోంది. ఐతే సినిమా మీద ధీమాగా ఉన్న దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ విడుదలకు రెండు రోజుల ముందే ప్రెస్ వాళ్లకు ప్రివ్యూలు వేసేశాడు. ఈ స్పెషల్ షో చూసిన క్రిటిక్స్ అందరూ ‘పద్మావత్’ను ఆకాశానికెత్తేస్తున్నారు. ప్రముఖ క్రిటిక్ కమ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ చిత్రానికి నాలుగున్నర స్టార్ట రేటింగ్‌తో రివ్యూ ఇవ్వడం వివేషం. ఒక్క మాటలో చెప్పాలంటే ‘పద్మావత్’ ఔట్ స్టాండింగ్ అని ఆయన అన్నారు.

తరణ్ మాత్రమే కాదు.. దేశంలో ప్రముఖ క్రిటిక్స్ అందరూ ‘పద్మావత్’ను ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ సినిమాను తెగ పొగిడేస్తున్నారు. దాదాపుగా అన్ని ప్రముఖ పత్రికలు.. వెబ్ సైట్లు ఈ సినిమా రివ్యూ ఆల్రెడీ ఇచ్చేశాయి. అందరూ 4కు అటు ఇటుగా రేటింగ్స్ ఇచ్చారు. విజువల్స్.. గ్రాండియర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా చెబుతున్నారు. ఎమోషన్లను చాలా బాగా పండించాడని.. ద్వితీయార్ధంలో కథను చాలా బాగా చెప్పాడని.. బన్సాలీ అద్భుతమైన స్టోరీ టెల్లర్ అనడానికి ఈ సినిమా మరో రుజువని అంటున్నారు. ముగ్గురు ప్రధాన పాత్రధారుల మీదా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ నటన గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. రాజ్ పుత్ లు ఈ సినిమా గురించి ఇంత గొడవ చేయాల్సిన అవసరం లేదని.. వాళ్లను ఏ రకంగానూ చెడుగా చూపించలేదని.. వాళ్ల గొప్పదనం మరింత పెంచి చూపించారని అంటున్నారు. ఐతే అన్నీ ఉన్న ఈ సినిమాకు ‘బాహుబలి’ తరహా భారీ యుద్ధ సన్నివేశాలు లేకపోవడం మైనస్ అని అంటున్నారు. అలాంటివి ఆశిస్తే నిరాశ తప్పదని చెబుతున్నారు. రాజమౌళిలా ఎంటర్టైనింగ్ గా సినిమాను మలచలేకపోయినట్లు అభిప్రాయపడుతున్నారు క్రిటిక్స్.


Tags:    

Similar News