నిన్న ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ విడుదలయ్యాక అభిమానుల అంచనాలు మాములుగా లేవు. ఇప్పటిదాకా పోస్టర్లకే పరిమితమైన హంగామా ఇప్పుడు వీడియో రూపంలోకి వచ్చేయడంతో పాటు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అంతటా రావడం వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేసింది. కథానాయకుడు మహానాయకుడు రెండు కలిపి ఒకే ట్రైలర్ లో చూపించడంతో మూడు నిముషాలు వాళ్ళకు కనులవిందుగా మారింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన అప్ డేట్ ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉంది. ఇందులో స్వర్గీయ ఎన్టీఆర్ పాట పాటలను రీమిక్స్ చేసి బాలయ్యతో పాటు ఇతర హీరొయిన్ల కాంబినేషన్ లో షూట్ చేసిన సంగతి తెలిసిందే.
రకుల్ ప్రీత్ సింగ్ తో వేటగాడులోని ఆకు చాటు పిందె తడిసే తాలుకు స్టిల్స్ గతంలోనే బయటికి వచ్చి హల్చల్ చేసాయి. అలాంటి రీమిక్స్ పాటల బిట్లు కథానాయకుడులో మొత్తం 12 దాకా ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. అంతకన్నా ఓ రెండు మూడు ఎక్కువే ఉన్నా ఆశ్చర్యం లేదు. యమగోలలో ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్లంతా తిమ్మిరెక్కిందా పాటకు జయప్రద పాత్రలో హన్సికతో బెల్ బాటం ప్యాంట్ లో బాలకృష్ణ రచ్చ మాములుగా ఉండదట. అలాగే అడవి రాముడులో కోటి రూపాయల పాటగా ప్రసిద్ది చెందిన ఆరేసుకోబోయి పాటలో పాయల్ రాజ్ పుత్ తో రొమాన్స్ ఉంటుందట.
గుండమ్మ కథలో లేచింది నిద్రలేచింది మహిళాలోకం పాటకు నిత్య మీనన్ తో చేసిన అల్లరి తాలుకు ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ఇవే కాదు నర్తనశాలలో బృహన్నల పాట బొబ్బిలి పులిలో మరో సూపర్ హిట్ సాంగ్ ఇలా సినిమా మొత్తం రీమిక్స్ మసాలాతో మోతేక్కిపోతుందని టాక్. అయితే ఇవి ఫ్యాన్స్ కు బాగానే కిక్ ఇస్తాయి కాని మరీ ఇన్నేసి రీమిక్సులు అంటే ఇప్పటి జెనరేషన్ ఓపిగ్గా చూడగలదా అనేది క్రిష్ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కథానాయకుడు ఆసాంతం ఇదే తీరులో సాగుతుందని తెలిసింది. కీరవాణి సంగీత ప్రధాన ఆకర్షణగా రూపొందిన ఎన్టీఆర్ ఫస్ట్ పార్ట్ కథానాయకుడు విడుదల జనవరి 9కి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి