పొన్నియిన్ సెల్వం.. ఎవరి రెమ్యునరేషన్ ఎంత?

Update: 2022-10-09 03:59 GMT
విడుదలకు ముందు భారీ చర్చ.. విడుదల వేళకు విపరీతమైన బజ్.. వెరసి.. విడుదలయ్యాక మిక్సైడ్ టాక్. పొన్నియిన్ సెల్వం-1 అలియాస్ పీఎస్1 మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో ఈ మూవీ దూసుకెళుతుంటే.. తెలుగులో మాత్రం ఈ సినిమా ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. అయితే.. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ మూవీకి క్రేజ్ పెరుగుతోంది. సినిమా మొత్తం తమిళ వాసన కొడుతోందని.. అర్థం కాని పేర్లతో ఇబ్బందికరంగా ఉందన్న విమర్శల వినిపించటం ఈ మూవీకి శాపంగా మారింది.

చరిత్రను సినిమాగా తీసినప్పుడు.. అందునా వెయ్యేళ్ల క్రితం నాటి చరిత్రను సినిమాగా తీసినప్పుడు.. చారిత్రక పేర్లు ఆ ప్రాంతానికి తగ్గట్లు ఉండకుండా మనం కోరుకున్నట్లు ఉండవు కదా? ఈ చిన్న విషయాన్ని వదిలేసి రివ్యూయర్లు కత్తి కట్టి మరీ.. రాసేసిన రాతలు ఈ సినిమా ఓపెనింగ్స్ కు ఇబ్బందికరంగా మారినా.. రోజులు గడిచే కొద్దీ.. సినిమాకు పాజిటివ్ బజ్ పెరుగుతోంది. ఈ సినిమాను చూసిన తర్వాత చరిత్ర పుస్తకాల్ని.. గూగుల్ ను శోధిస్తున్న వారు.. ఈ సినిమా అసలు చరిత్రను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు మణిరత్నం నలభై ఏళ్ల కల.. ఎట్టకేలకు వెండితెర మీద ఆవిష్క్రతమైంది. విడుదలైన రెండు మూడు రోజుల తర్వాత నుంచి ఈ మూవీ తెలుగు వెర్షన్ కు ఆదరణ పెరుగుతోంది. ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అయితే.. తగ్గిన స్క్రీన్లు కొంత ఇబ్బందికరంగా మారినప్పటికి.. సినిమాకు వస్తున్న స్పందన కొంత సానుకూలంగా మారిందన్న మాట వినిపిస్తోందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ భారీ బడ్జెట్ మూవీకి ఎంత ఖర్చు చేశారు? ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ కు ఎంతెంత రెమ్యునరేషన్ ఇచ్చారన్నది ఆసక్తికరంగా మారింది.

దీనికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. అనధికారికంగా అందుతున్న సమాచారాన్ని చూస్తే.. ఈ మూవీ బడ్జెట్ 300 కోట్ల రూపాయిలు కాగా.. సినిమాను గ్రాఫిక్స్ మీద కంటే కూడా రియల్ లొకేషన్స్ కే అధిక ప్రాధాన్యత ఇచ్చారు మణిరత్నం. అందుకే.. పక్కా ప్రణాళికతో 150 రోజుల్లోనే రెండు భాగాలకు సంబంధించిన షూట్ ను పూర్తి చేయటం గమనార్హం. ఈ సినిమాలో ట్యూన్స్ కోసం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ను బాలికి తీసుకెళ్లి మరీ.. వెయ్యేళ్ల క్రితం నాటి ట్యూన్స్ తనకు కావాలని అడిగారట.

ఇక.. తారల రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన మాజీ ప్రపంచ సుందరి.. బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యారాయ్ ఇందులో ఒక పాజిటివ్.. ఒక నెగిటివ్ పాత్రను పోషించారు. దీనికి సంబంధించిన వివరాల్ని సినిమా చివర్లో రివీల్ చేయటం తెలిసిందే. పొన్నియిన్ సెల్వం కోసం ఐష్ కు రూ.10 కోట్లు ఇస్తే.. విక్రమ్ కు రూ.15 కోట్లు.. జయం రవికి రూ.8కోట్లు.. కార్తికి రూ.5 కోట్లు.. త్రిషకు రూ.2 కోట్ల పారితోషికం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పొన్నియిన్ సెల్వం టైటిల్ పాత్రను పోషించిన జయం రవికి తక్కువ పారితోషికం లభించటం.
Tags:    

Similar News