ఎన్టీఆర్ కథానాయకుడి రూపంలో ఇవాల్టి నుంచి టాలీవుడ్ సంక్రాంతి హడావిడి మొదలైపోయింది. ఈ వరస 12 దాకా కొనసాగుతుంది. ఫైనల్ టచ్ ఇచ్చేది ఎఫ్2 నే. ఇప్పటిదాకా ప్రమోషన్ విషయంలో కాని అటు హైప్ లో కాని వెనుకబడి ఉంది ఎఫ్2నే. వెంకటేష్ వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ అయినప్పటికీ ఆ రేంజ్ హంగామా కనిపించడం లేదు. మొన్న ట్రైలర్ రిలీజ్ అంటూ చేసిన వేడుక తప్ప ఇంకే జోష్ కనిపించడం లేదు. పైకి చూసేందుకు ఇది సింపుల్ బడ్జెట్ లో కానిచ్చేసిన మూవీగా కనిపిస్తున్నా నిర్మాత దిల్ రాజుకు బాగానే తడిసి మోపెడయ్యిందని సమాచారం.
రెమ్యునరేషన్లకే భారీగా సమర్పించుకోవాల్సి వచ్చిందట. వెంకటేష్ 5 కోట్లు వరుణ్ తేజ్ 3.5 కోట్లతో ఎనిమిదిన్నర కోట్లు వాళ్ళకే వెళ్ళిపోగా తమన్నా మెహ్రీన్ కంటే ఎక్కువ తీసుకుని బాగానే బిల్ వేసిందని టాక్. వెంకీ సీనియర్ హీరో కాబట్టి ఫాం లో ఉన్న ఇతర కుర్ర హీరొయిన్లు ఎవరూ రాకపోవడంతో తమన్నా కాస్త ఎక్కువ డిమాండ్ చేసినా మిల్కీనే తీసుకోవాల్సి వచ్చిందట. ఇదిలా ఉండగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి డిమాండ్ లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ 25 లక్షలకు పైగా పుచ్చుకున్నట్టు సమాచారం. ఇక ప్రియదర్శి-అన్నపూర్ణ- రఘుబాబు అందరూ పీక్స్ లో ఉన్నవాళ్ళే.
ఇవి కాకుండా ఫారిన్ షెడ్యూల్ కోసం బాగానే చేతి చమురు వదిలిందని వినికిడి. ఈ లెక్కన బడ్జెట్ అటు ఇటుగా పాతిక కోట్ల దాకా అయ్యుండొచ్చు అనే మాట వినిపిస్తోంది. బిజినెస్ ఎంతయ్యింది అనే లెక్కలు బయటికి రాలేదు కాని సుమారు 40 కోట్ల మేరకు లావాదేవీలు జరిగాయని తెలిసింది. సంక్రాంతి సీజన్ కాబట్టి బయ్యర్లు కాస్త ధైర్యం చేసారు. ఏ మాత్రం టాక్ తేడా వచ్చి పోటీలో ఉన్న ఇతర సినిమాలు పికప్ అయితే పరిస్థితి ఇంకా ప్రతికూలంగా ఉంటుంది. సో ఎఫ్2 చాలా టఫ్ గానే బరిలో దూకుతోంది.
Full View