సినిమా ఇండస్ట్రి పై జనాలు చూసే దృకోణం ఇప్పుడుప్పుడే మారుతున్న తరుణంలో మళ్ళీ కొన్ని అవాంఛనీయ సంఘటనులు జరిగి మళ్ళీ యదాస్థితికి చేరుస్తున్నాయి. మలయాళం సినిమా ఇండస్ర్టీలో ఇప్పుడు ఒక టాప్ హీరో ఒక హీరోయిన్ పై అఘాయిత్యం చేయించాడు అనే న్యూస్ ఉంది చూశారో.. షాకిస్తోంది అంతే. ఈ నటి అపహరణ సంఘటన మొత్తం సౌత్ సినిమా అంతా షాక్ కు గురిచేసింది కదా. చాల కాలంగా ఈ కేసు గురించి చర్చలు - విచారణలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎట్టకేలకు ఒక చర్య తీసుకున్నారు కేరళ పోలీసులు.
మలయాళ స్టార్ హీరో దిలీప్ పై ఈ కేసు విషయంలో పలురకాల అనుమానాలు వచ్చాయి. అయితే కేరళ సినీ ప్రముఖులు మాత్రం ఎవరికీ మద్దతుగా మాట్లాడకుండా తెలివిగా తప్పించుకున్నారు. ఈ కేసు విచారణలో కొన్ని నిజాలు బయటకు రావడంతో నటుడు దిలీప్ ను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ చాలామంది ఈ విషయం గురించి మాట్లాడటానికి అంతా సుముకంగా లేరు ఎందుకంటే అరెస్టు అయింది ఒక స్టార్ హీరో కాబట్టి. కానీ పిజ్జా సినిమాలో నటించిన హీరోయిన్ రమ్యా నంబీశన్ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకుంది. “న్యాయం కోసం పోరాడిన అమ్మాయికి దక్కిన విజయమిది. నిజాన్ని అబద్ధంగా ఎప్పటికీ మార్చలేము. నిజం ఎప్పటికైనా భయటపడుతుందనే నమ్మకం మళ్ళీ బలపడింది. ఇంతకాలం న్యాయం కోసం ఎదురుచూసినందుకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఈ విషయంలో కేరళ పోలీసులుకు హ్యాట్సాప్ చెప్పాలి” అని చెప్పింది.
కేరళ పోలీసులు భావనకు తెలిపిన మద్దతుకు అక్కడి ప్రజలూ కొందరు సినీ నటులు మెచ్చుకుంటున్నారు. మరోవైపు దిలీప్ అరెస్టు పై అక్కడ సినిమా వర్గం మాత్రం ఆశ్చర్యపోతుంది. ఈరోజు అక్కడి మూవీ అసోసియేషన్ మనోడిని చర్యలను ఖండించగా.. అతని పై పెట్టుబడి పెట్టిన నిర్మాతలు మాత్రం తలపట్టుకొని ఏడుస్తున్నారు. ఇక కోర్టు అతగాడికి బెయిల్ నిరాకరించడం మరో షాకింగ్ విషయం అనే చెప్పాలి.