పోయిన శుక్రవారం ‘దువ్వాడ జగన్నాథం’ సోలోగా రంగంలోకి దిగి మంచి వసూళ్లు రాబట్టుకుంది. ఈ శుక్రవారం ఒకటికి మూడు సినిమాలొస్తున్నా వాటిపై పెద్దగా అంచనాల్లేవు. ఇక తర్వాతి వారం నాని సోలో బ్యాటింగ్ కు రంగం సిద్ధం చేసుకున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ‘జయ జానకి నాయక’ ఆగస్టుకు వాయిదా పడటంతో జులై 7న ‘నిన్ను కోరి’ పోటీ లేకుండా రేసులోకి దిగుతుందని అంతా అనుకున్నారు. కానీ దీనికి ఓ చిన్న సినిమా పోటీగా వస్తోంది. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి సమర్పణలో వస్తున్న ‘రెండు రెళ్లు ఆరు’ కూడా ఆ వీకెండ్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని జులై 8న విడుదల చేయబోతున్నారు.
అనిల్ మల్లెల.. మహిమలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ కొత్త దర్శకుడు నందు మల్లెల రూపొందించిన సినిమా ‘రెండు రెళ్లు ఆరు’. ఈ మధ్యే రాజమౌళి చేతుల మీదుగా ఈ చిత్ర ఆడియో విడుదల కావడంతో జనాల దృష్టి దీనిపై పడింది. ఈ సినిమా గురించి జక్కన్న పాజిటివ్ గా మాట్లాడాడు. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరున్న సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం కూడా దీనిపై జనాలకు కొంత ఆసక్తి కలగడానికి కారణమే. ఐతే ‘రెండు రెళ్లు ఆరు’ ప్రోమోస్ ఆకట్టుకున్నప్పటికీ.. తెలిసిన స్టార్ కాస్ట్ లేకపోవడం.. ఇప్పటిదాకా పెద్దగా ప్రచార కార్యక్రమాలేవీ చేపట్టని నేపథ్యంలో ఇది ఏమేరకు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుందా అన్నది సందేహం. అందులోనూ నాని మూవీ ‘నిన్ను కోరి’ మీద మంచి అంచనలున్నాయి. మిగిలిన వారం రోజుల్లో ప్రమోషన్ కొంచెం గట్టిగా చేస్తే తప్ప ఈ చిన్న సినిమాకు కష్టమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/