పవన్ ఆదర్శం.. కూతురికి రేణు సలహా

Update: 2016-02-12 09:31 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న అలవాటు విపరీతంగా పుస్తకాలు చదవడం. తను ఖాళీగా ఉండే సమయం మొత్తం పుస్కకాలకే కేటాయించడం పవన్ ప్రత్యేకత. ఇప్పటివరకూ 2 లక్షల బుక్స్ చదివేశాడంటే.. రీడింగ్ హ్యాబిట్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది. పవన్ కి అత్యంత సన్నిహితుడుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మారేందుకు కారణం కూడా ఈ పుస్తకాలు చదివే అలవాటే అంటారు.

ఇప్పుడు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా తన కూతురు ఆద్యకు పుస్తకాల గురించి చాలా చెబుతోంది. చదవడంలో ఉన్న ఆనందాన్ని వివరిస్తోంది. 'నా చిన్నారి కూతురుకు నేనిచ్చే అమూల్యమైన సలహా ఏంటంటే.. పుస్తకాలతో ప్రేమలో పడమని చెబ్తాను. ఎందుకంటే పుస్తకాలు చదవడం అలవాటు అయితే, వారు ఎప్పటికీ ఒంటరితనం ఫీల్ అవరు' అని చెప్పింది రేణు దేశాయ్. తండ్రికి ఉన్న ఈ అలవాటు గురించి.. చాలా సార్లే  చెబుతూ ఉంటుందని తెలుస్తోంది. బుక్ రీడింగ్ అంటే నాన్నకులా ఉండాలనే సలహా ఇస్తూ ఉంటుందట ఈ తల్లి.

ఇష్క్ వాలా లవ్ చిత్రం తీసి చేతులు కాల్చుకున్న రేణు.. చిన్నారులతో గడుపుతోంది. కొత్త ప్రాజెక్టు పనులు ఇంకా ప్రారంభించలేదని తెలుస్తోంది. అయితే.. ఈ మూవీ తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజ్ కావడం లేదు. నేరుగా శాటిలైట్ ద్వారానే విడుదల చేస్తుండడం విశేషం. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా తెరంగేట్రం చేశాడు.
Tags:    

Similar News