సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సామాన్యుల సంగతేమో గానీ....కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలకు మాత్రం కంటి మీద కునుకులేకుండా పోతోంది. అందులోనూ, సినీ తారలు...క్రికెటర్లు వంటి వారి గురించి ఏ చిన్న సమాచారమో...గాసిప్పో దొరికితే చాలు....అది గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాట్సాప్ - ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్....అబ్బో ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లలో ఆ వార్తో, ఫొటోనో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఒకవేళ ఆ చక్కర్లు కొట్టే వార్త తప్పని తేలితే....దిన పత్రికో...న్యూస్ చానెలో అయితే సవరణకు అవకాశం ఉంటుంది. కానీ, సోషల్ మీడియాలో...ఆ అవకాశం తక్కువగా ఉండడంతో ఫేక్ న్యూస్ లు, సరిగా నిర్ధారణ చేసుకోని వార్తలే అధికంగా సర్క్యులేట్ అవుతుంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు చచ్చి బ్రతికారు.తాజాగా అదే కోవలో ....రేణు దేశాయ్ ఎంగేజ్ మెంట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఆ ఫొటోలో ఉన్నది రేణుదేశాయ్ కు కాబోయే భర్త కాదని తాజాగా తేలడంతో నెటిజన్లు షాకయ్యారు.
ఓ వ్యక్తితో రేణు దేశాయ్ కు ఎంగేజ్ మెంట్ అయిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి చేయి పట్టుకున్న రేణు దేశాయ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఆ ఫొటోలో రేణుకు కాబోయే భర్త ముఖం స్పష్టంగా కనబడలేదు. అయితే, ఈ లోపు ఔత్సాహికులైన కొందరు నెటిజన్లు..రేణుకు కాబోయే భర్త ఫొటో ఇదేనంటూ...ఓ ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ ఫొటోలోని వ్యక్తి కూడా పెళ్లికొడుకు గెటప్ లో ఉండడం, అతడి వెనుక రేణు నిలబడి చిరునవ్వులు చిందిస్తుండడంతో....అతడే రేణు కాబోయే భర్త అని ఫిక్సయ్యారు. అయితే, ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి రేణు సోదరుడని తేలడంతో నెటిజన్లు అవాక్కయ్యారు. 2015 ఫిబ్రవరి 14న రేణు సోదరుడి ఎంగేజ్ మెంట్ సందర్భంగా దిగిన ఫొటోను ఎవరో అప్ లోడ్ చేశారు. గుడ్డిగా దాన్నే జనాలు ఫార్వార్డ్ చేసుకుంటూ వైరల్ చేశారు. ఆ ఫొటోలో ఉన్న రేణు కు....ఇపుడు రేణుకు చాలా తేడా ఉన్న సంగతి కూడా మరచిపోయారు పాపం. ఇప్పటికే....పవన్ ఫ్యాన్స్ - ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ ట్రోల్ చేసేవారి పుణ్యమా అంటూ రేణు ట్విట్టర్ నుంచి వైదొలిగింది. ఇక ఈ ఫొటో వ్యవహారం ఆమెను మరింత బాధపెట్టి ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి, పవన్ స్వయంగా రేణుకు విషెస్ చెప్పిన తర్వాతైనా....పవన్ అభిమానులు...రేణు జీవితంలోకి తొంగిచూడడం ఆపుతారేమో వేచి చూడాలి.