మలయాళంలో రేణు దేశాయ్ సినిమా

Update: 2017-11-13 07:27 GMT
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నటిగా సినీ పరిశ్రమకు పరిచయం అయినప్పటికీ.. ఆమె పెద్దగా సినిమాలు చేసింది లేదు. ‘బద్రి’ తర్వాత ఆమె ‘జానీ’లో మాత్రమే నటించింది. ఆపై పవన్ చేసిన సినిమాలకు వరుసగా ప్రొడక్షన్లో పని చేసింది. పవన్ నుంచి విడిపోయాక ఆమె దర్శకత్వం వైపు అడుగులేసింది. తన మాతృభాష మరాఠీలో ఆమె ‘ఇష్క్ వాలా లవ్’ ఓ సినిమా తీసింది. కానీ అదంత మంచి ఫలితాన్నివ్వలేదు.

ఐతే తొలి సినిమా ఫ్లాపైందని రేణు దర్శకత్వ ప్రయత్నాలేమీ ఆపేయలేదట. కథలు రాయడం కొనసాగిస్తున్నానని.. తన రెండో సినిమాకు కథ కూడా సిద్ధమవుతోందని.. మలయాళంలో ఆ సినిమా చేయబోతున్నానని రేణు వెల్లడించడం విశేషం. ఈసారి తాను దర్శకురాలిగా మంచి ఫలితాన్నందుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. తాను నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ.. తన అభిరుచి మాత్రమే దర్శకత్వమే అని ఆమె చెప్పింది.

16 ఏళ్ల వయసులో మోడల్ గా కెమెరా ముందుకు వచ్చినపుడు కూడా తనకు దర్శకత్వం మీదే మనసు లాగిందని.. కెమెరా ముందు కంటే వెనుకే ఉండాలని కోరుకున్నానని.. అందుకే తాను ఆ తర్వాతి కాలంలో సినిమా తీసే అన్ని విభాగాల మీదా దృష్టిసారించానని.. ఎడిటింగ్ నేర్చుకున్నానని.. ప్రొడక్షన్ వర్క్ చూశానని.. స్క్రిప్ట్ వర్క్ చేయడం కూడా నేర్చుకున్నానని రేణు తెలిపింది. హీరోయిన్ గా తన మీద తనకు ఎప్పుడూ కాన్ఫిడెన్స్ లేదని రేణు చెప్పింది.
Tags:    

Similar News