సినిమా హీరోల మీద అభిమానం ఎంతైనా ఉండొచ్చు. దానికి హద్దులు ఉండాలా లేదా అనేది వారిష్టం. కానీ తారల వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసే హక్కు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే రైట్స్ కానీ ఎవరికీ ఉండవు. కానీ విస్తృతంగా పెరిగిపోయిన టెక్నాలజీ పుణ్యమా అని వీటికి అడ్డుకట్ట వేయటం కాదు కదా కనీసం తప్పని కూడా చెప్పలేని పరిస్థితి ఎదురవుతోంది. నిన్న రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి దాని తాలూకు ఫోటో మీద సోషల్ మీడియాలో జరుగుతున్న హంగామా అంతా ఇంతా కాదు.
పవన్ రేణు దేశాయ్ తో విడాకులు తీసుకున్నాక ఎవరితో అయినా జీవించే హక్కు ఇద్దరికీ సమానంగా ఉంటుంది. అంతే తప్ప మాజీ వదినా నువ్విలా చేసుకుండకూడదు మా హృదయాలు గాయపడ్డాయి అని ఫాన్స్ గా చెప్పుకునే వాళ్ళు కామెంట్ చేయటం ముమ్మాటికీ తప్పే. పవన్ కూడా విడాకులు తీసుకున్నాక వేరే పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలకు తండ్రయ్యాడు. అది తప్పు కానప్పుడు రేణు దేశాయ్ చేసింది కూడా వీసమెత్తు తప్పు కాదు. అంటే అది అన్నవాళ్ళదే కానీ తనది కాదు.
ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల కామెంట్స్ కు రేణు దేశాయ్ స్పందించవచ్చు లేక మౌనంగా ఉండవచ్చు. కానీ అలా ఏదో ఒకటి అభిమానం పేరిట అనేయటం వారి పర్సనల్ లైఫ్ మీద జల్లుతున్న బురదలాగా ఉంటుంది తప్ప మరొకటి కాదు. సంస్కారవంతులైన ఫాన్స్ లేకపోలేదు. జరిగినదేదో జరిగిపోయింది పవన్ ఫాన్స్ తరఫున మీ కొత్త జీవితం బాగుండాలని కోరుకున్న వాళ్లకు కూడా కొదవ లేదు. కానీ మంచి కంటే చెడు ఎక్కువగా ప్రచారం దక్కించుకునే ఆన్ లైన్ ప్రపంచంలో తేడాగా ఉన్న కామెంట్స్ కే ప్రాముఖ్యత లభిస్తోంది.
రేణు కొత్త జీవితం గురించి పవన్ ఏదైనా ట్వీట్ చేసే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. కానీ ఇలాంటి విషయాల్లో మౌనాన్ని ఆశ్రయించే పవన్ ఆ పని చేయకపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. పిల్లలు కూడా తనకు అండగా ఉన్నారు అని చెబుతున్న రేణు దేశాయ్ మొహంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని ప్రోత్సహించే విధంగా కొందరు అభిమానుల తీరు ఉండగా అదేదో నేరం అన్నట్టు పరిణితి లేని వాళ్ళు చేస్తున్న కామెంట్స్ పట్ల రేణు దేశాయ్ స్పందించకపోవడమే మంచిది.