పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె నిశ్చితార్థం చేసుకుంది. దానికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేసింది. ఆ సమయంలో రేణు-పవన్ పిల్లలు అకీరా.. ఆద్య కూడా తమ వెంేట ఉన్నారు. తాను చేసుకోబోయే వ్యక్తిని జనాలకు పరిచయం చేయడానికి రేణు ఇష్టపడలేదు. ఇదిలా ఉంటే.. రేణుది ప్రేమ పెళ్లే అని అందరూ భావిస్తున్నారు. కానీ అది నిజం కాదని రేణు స్పష్టం చేసింది. తాను ఇప్పుడు చేసుకోబోయేది అరేంజ్ డ్ మ్యారేజే అని ఆమె వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె పవన్ కు గట్టిగా తగిలేలా కొన్ని వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఒకసారి తాను ప్రేమలో పడ్డానని.. మళ్లీ మళ్లీ అలా చేయలేనని రేణు చెప్పడం విశేషం. తాను సంపాదిస్తున్నానని.. అలాగే తనకు కాబోయే భర్త కూడా సంపాదిస్తున్నాడని.. అలాంటపుడు ఇద్దరూ కలిసి లివ్-ఇన్ రిలేషన్షిప్ లో ఉంచొచ్చని కూడా అనిపించవచ్చని.. కానీ తాను అలా చేయాలనుకోలేదని ఆమె చెప్పింది. ఒకసారి తాను తప్పనిసరి పరిస్థితుల్లో సహజీవనంలో ఉన్నానని.. కానీ ఇప్పుడలా చేయదలుచుకోలేదని స్పష్టం చేసింది. పెళ్లి అనేది అద్భుతమైన విషయమని.. తనకు వివాహ వ్యవస్థ మీద ఎంతో నమ్మకముందని ఆమె చెప్పింది. తాను రెండో పెళ్లి చేసుకుంటుండటం అకీరాకు ఇష్టం లేదని చాలామంది భావిస్తున్నారని.. కానీ నిజానికి అకీరా ఎంగేజ్మెంట్ సందర్భంగా మెనూలో తనకిష్టమైన పనీర్ బటర్ మసాలా లేనందుకు మాత్రమే బాధపడ్డాడని.. తన పెళ్లి గురించి కాదని రేణు చమత్కరించడం విశేషం. తన ఎంగేజ్మెంట్ నేపథ్యంలో తమ వ్యక్తిగత.. వృత్తిగత జీవితాల్లో అసంతృప్తితో ఉన్న వాళ్లు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తూ హేట్ మెసేజులు పెట్టారని.. అదే సమయంలో ఎందరో తనకు మద్దతుగా పాజిటివ్ మెసేజులు పంపారని రేణు చెప్పింది.