సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార మరియు డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దంపతులు గత కొన్ని రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. సుదీర్ఘ ప్రేమాయణానికి తెర దించుతూ వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట.. ఇటీవలే కవలలకు జన్మనిచ్చినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే పెళ్ళైన నాలుగు నెలలకే పిల్లలకు జన్మనివ్వడం పై సెలబ్రిటీ కపుల్ విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. సరోగసి విధానం ద్వారా నయన్ దంపతులు తల్లిదండ్రులు అవ్వడం పెద్ద దుమారమే రేపింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ వ్యవహారం పై త్రిసభ్య కమిటీని నియమించింది.
సరోగసి ద్వారా విగ్నేష్ - నయన్ దంపతులు తల్లిదండ్రులు కావడం చట్టబద్ధంగా జరిగిందా లేదా? నిబంధనలు పాటించారా లేదా? అనే విషయాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం ఆ కమిటీకి వారం రోజుల గడువు ఇచ్చింది. అయితే ఈరోజుతో త్రిసభ్య కమిటీ విచారణ పూర్తయిందని తెలుస్తోంది.
సరోగసీ వ్యవహారం నయనతార దంపతులను విచారించిన కమిటీ.. ఓ నివేదికను రెడీ చేసింది. అధికారులు రేపు తమిళనాడు సర్కారుకు ఈ రిపోర్ట్ ను అందజేయనున్నారని తెలుస్తోంది. దీంతో ఈ నివేదికలో ఏం ఉందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నయన్ - విఘ్నేష్ లు అన్ని నిబంధనలు పాటించే తల్లిదండ్రులు అయ్యారా లేదా అని అందరూ ఆలోచిస్తున్నారు.
అయితే నయన్ దంపతులు మాత్రం కమిటీకి వివరణ ఇచ్చిన తర్వాత.. దాని గురించి ఏమి ఆలోచించకుండా తమ కవల పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ.. సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు షేర్ చేశారు.
ఇందులో విగ్నేష్ - నయన్ ఇద్దరూ చెరొక పిల్లాడిని ఎత్తుకొని దీపావళి విషెస్ చెబుతూ కనిపించారు. కవలలు పుట్టిన తర్వాత వారి కాళ్లను ముద్దాడే ఫోటోలను పంచుకున్న విఘ్నేష్.. ఈ వీడియోలో కూడా తమ పిల్లల ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.
“అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ మీరు సుఖ సంతోషాలతో ఉండాలి. మీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రేమ ఒక్కటే జీవితాన్ని సంతోషంగా మార్చుతుందని గుర్తుంచుకోవాలి. ప్రేమలో విశ్వాసంతో పాటు మంచితనం అనే ఎప్పుడూ ఉండాలి. అప్పుడే ఆ ప్రేమ బలంగా ఉండగలుగుతుంది” అని విగ్నేష్ శివన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కాగా, గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న నయనతార - విగ్నేష్ జంట.. జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ వెడ్డింగ్ ని 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే పేరుతో డాక్యుమెంటరీగా అందిస్తోంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దీన్ని రూపొందించారు. ఇది త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.