ప్రభాస్ పై ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్ కామెంట్స్

Update: 2022-08-02 09:33 GMT
ప్రభాస్ తో ఒక్కసారి వర్క్‌ చేసిన వారు జీవితాంతం కూడా గుర్తు పెట్టుకునేంత అనుభవంను మరియు మంచి మొమోరీస్‌ ను పొందుతారు అనేది ఇండస్ట్రీ లో టాక్‌. ఆయనతో వర్క్ అనేది అద్భుతంగా ఉంటుందని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. ఆయన మాట్లాడే తీరు మొదలుకుని ఆయన ఇంటి నుండి వచ్చే వంట వరకు ప్రతి విషయంలో కూడా ప్రభాస్ స్పెషల్‌ అనే వారు చాలా మంది ఉన్నారు.

తాజాగా ఒక నెటిజన్‌ ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత అయిన ప్రముఖ సౌండ్ డిజైనర్ రసుల్‌ పూకుట్టి ని.. రాధేశ్యామ్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రభాస్ గురించి కొన్ని మాటలు మా కోసం చెప్పండి అంటూ రిక్వెస్ట్‌ చేశాడు. ఆ నెటిజన్‌ ట్వీట్ కు రసుల్‌ సమాధానం ఇచ్చాడు. రకుల్‌ తన ట్వీట్‌ లో ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించినట్లుగా మాట్లాడి ప్రభాస్ అభిమానుల యొక్క అభిమానం దక్కించుకున్నాడు.

రసుల్‌ ట్విట్టర్ లో... ప్రభాస్ మంచి వ్యక్తి. పని విషయంలో చాలా ప్రొఫెషనల్ గా ఉంటాడు. అతడు తన సినిమా యొక్క సాంకేతిక నిపుణులను గౌరవించే తీరు నచ్చింది. తన టెక్నికల్ టీమ్ ను పూర్తిగా నమ్ముతాడు.

అలాగే తన చుట్టూ ఒక మంచి ప్రపంచంను సృష్టించుకోగల సమర్ధుడు ప్రభాస్‌.. అదే అతడి విజయానికి కారణం. ప్రేక్షకుల కోసం ఏదైనా చేస్తాడు. నేను అతడిని ప్రేమిస్తున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు.

ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం రసుల్‌ యొక్క ట్వీట్‌ ను తెగ షేర్ చేస్తున్నారు. అస్కార్ అవార్డ్‌ విన్నర్‌ నుండి అంతటి మంచి మాటలను దక్కించుకున్నాడు అంటే ప్రభాస్ యొక్క గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఆదిపురుష్‌ షూటింగ్‌ పూర్తి అయ్యి పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సలార్‌ మరియు ప్రాజెక్ట్ కే లు షూటింగ్‌ దశల్లో ఉన్నాయి. రాజా డీలక్స్ మరియు స్పిరిట్ సినిమాలు త్వరలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో ప్రభాస్‌ అభిమానులకు సినిమాల జాతర పక్కా...!
Tags:    

Similar News