రేవతి.. బముముఖ ప్రజ్ఞ అనే పదానికి సిసలైన నిర్వచనం. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ పరిశ్రమల్లో పరిచయం అక్కర్లేని పేరు ఇది. నాలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. నటి, దర్శకురాలు, నిర్మాత.. ఇలా అన్నిటా అందెవేసిన చేయి.
తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన 'ప్రేమ ప్రేమ ప్రేమ' అనే చిత్రంలో కథానాయికగా నటించారు. ఎన్నో విలక్షణమైన సినిమాల్లో నటించిన అనుభవం తన సొంతం. మూడు సార్లు జాతీయ అవార్డు గ్రహీత. 1991లో సల్మాన్‌ఖాన్ సరసన 'లవ్' అనే చిత్రంలో నాయికగా నటించింది. అప్పటికే సల్మాన్ కంటే సీనియర్ నటి. సల్లూ భాయ్ యువకుడిగా ఉన్నప్పుడు అతడికి నాయిక అయ్యింది. ఇప్పటికీ సల్మాన్ నవమన్మధుడిలానే ఉన్నాడు. తనేమో కాస్త వయసు మీదపడి కనిపిస్తోంది. సల్మాన్ ఇంకా టీనేజర్‌లానే ఉన్నాడు. ఈ సంగతులన్నీ రేవతి గుర్తు చేసుకుంటున్నారిప్పుడు.
తొలి ప్రయత్నమే సల్మాన్‌ని డైరెక్ట్ కూడా చేశాను. ఫిర్ మిలేంగే చిత్రంలో నటించాల్సిందిగా తనకి ఫోన్ చేసినప్పుడు.. మారు మాటైనా లేకుండా వెంటనే ఓకే చెప్పాడు. నీకోసం నటిస్తానని చెప్పాడు. తను గొప్ప నటుడు. మంచి మనిషి. గొప్ప స్నేహితుడు. నా కెరీర్ ప్రారంభం నుంచి తెలుసు. తనతో మంచి స్నేహం ఉంది.. అంటూ తన గతాన్ని నెమరు వేసుకున్నారు రేవతి.
తెలుగులో నటించరా? అన్న ప్రశ్నకు.. నటిస్తాను. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ నాలుగు భాషల్లో అవకాశాలొస్తున్నాయి. నటించడానికి రెడీ. అలాగే దర్శకత్వం కూడా వహిస్తా. అయితే రెండేళ్ల తర్వాతే. ప్రస్తుతం నాలుగేళ్ల చిన్నారి ఆలనాపాలనా చూసుకోవాల్సి ఉంది. అందుకే కేవలం నటన వరకూ ఓకే అనుకున్నా.. అని రేవతి చెప్పారు.