బుగ్గపై ముద్దు తప్పుకాదు.. పెదాలపై పెడితే తప్పా?

Update: 2019-03-27 11:18 GMT
హోలీ సందర్బంగా బాలీవుడ్‌ హీరోయిన్స్‌ నియా శర్మ మరియు రెయనా పండిట్‌ ప్రెస్‌ మీట్‌ లో ఒకరికి ఒకరు హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్న సందర్బంగా లిప్‌ లాక్‌ చేసుకున్నారు. అంత మంది మీడియా ముందు ఆ ఇద్దరు హీరోయిన్స్‌ లిప్‌ లాక్‌ చేసుకోవడం పెద్ద చర్చకు తెర తీసింది. వారిద్దరు కూడా స్వలింగ సంపర్కులు అనే విమర్శలు మొదలయ్యాయి. వారిద్దరు సభ్యసమాజంకు చెడు సందేశం ఇస్తున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. తమపై మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవ్వడంతో పాటు, వ్యక్తిగతంగా దాడులకు కూడా పాల్పడుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరు మీడియా ముందుకు వచ్చి తమ ముద్దుకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

రెయనా పండిట్‌ స్పందిస్తూ... ఒక అమ్మాయికి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నప్పుడు లేని ఇబ్బంది, అదే అమ్మాయి పెదవుల మీద ముద్దు పెడితే వచ్చే సమస్య ఏంటీ, ఎందుకు ఈ విషయాన్ని ఇంత నానా యాగీ చేస్తున్నారు. నియా నేను చాలా విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్లం. ఆమె, నేను చాలా మంచి స్నేహితులం. నాకు అక్క తర్వాత నియా చాలా క్లోజ్‌ గాఉ ంటుంది. మేము ఏ సదర్బంలో కలిసినా కూడా చాలా సంతోషంగా గడిపేందుకు ప్రయత్నిస్తాం. నియాను నేను ఒక సోదరిగా భావిస్తాను. అలాంటి ఆమెను ముద్దు పెట్టుకుంటే తప్పెంటి, చిన్న విషయాన్ని మరీ ఎందుకు ఇంత వివాదం చేస్తున్నారంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

నియా ఈ విషయమై మాట్లాడుతూ.. ఒక చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా ముద్దు వెనుక ఎలాంటి ఉద్దేశాలు లేవు, అసలు ముద్దు పెట్టుకునే ముందు వరకు తాము ఎలాంటి ఆలోచన కలిగి లేము, ఆ తర్వాత కూడా చాలా కామన్‌ గా ఉన్నాం. కాని కొందరు మాత్రం మమ్ముల్ని స్వలింగ సంపర్కులు అంటూ విమర్శిస్తున్నారు. నా సోదరిలాంటి రెయానాను ముద్దు పెడితే ఇలాంటి విమర్శలు రావడం చాలా బాధాకరంగా ఉంది. విమర్శలను కంట్రోల్‌ చేసే ఓపిక నాకు లేదని నియా చెప్పుకొచ్చింది. మొత్తానికి వీరిద్దరు కూడా ఆ ముద్దును చాలా లైట్‌ తీసుకుంటూ ఉంటే నెటిజన్స్‌ మాత్రం ఆ ముద్దును చాలా సీరియస్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News