నా క్యాస్ట్ అంటూ ఆర్జీవీ గ‌డ‌బిడ‌

Update: 2019-08-26 07:10 GMT
ప్ర‌తిసారీ ఏదో ఒక గ‌డ‌బిడ‌తో ఉచిత ప‌బ్లిసిటీ కోరుకునే ఆర్జీవీ ఈసారి ఏం ప్లాన్ చేశారు? అంటే.. ఇదిగో ఆయ‌న మార్క్ లో `క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు` ప్రీ-ఫ్రీ ప్ర‌చారానికి తెర తీశారు. గ‌త కొంత‌కాలంగా ఈ సినిమాకి కాస్టింగ్ సెల‌క్ష‌న్ లో బిజీగా ఉన్న ఆర్జీవీ అప్పుడ‌ప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక వివ‌రం చెబుతూ గ‌డ‌బిడ‌ను ప్లాన్ చేశారు.

ఈసారి డార్లింగ్ ప్ర‌భాస్ ని.. అత‌డు న‌టించిన `సాహో`ని ఆయ‌న వ‌ద‌ల్లేదు. అంతేకాదు `ప్ర‌భాస్ నా క్యాస్ట్!` అంటూ త‌న‌దైన మార్క్ రీసౌండ్ ని వినిపిస్తూ క‌ల‌క‌లం రేపారు ఆర్జీవీ. ఆర్జీవీ మాట్లాడుతూ..``నాకు చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. అందుక‌నే రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో సినిమా కోసం క‌ళ్లు వాచిపోయేలా ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ప్ర‌భాస్ నా క్యాస్ట్(కులం) కాబ‌ట్టి.. ఈ సంద‌ర్భంగా నా నెక్స్ట్‌ సినిమా `క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు` లోని ఒక పాట‌ను 27వ తారీఖు ఉద‌యం 9.27 నిమిషాలకు బ్ర‌హ్మ ముహూర్తంలో రిలీజ్ చేయ‌బోతున్నాం`` అంటూ సౌండ్ అదిరేలా వినిపించారు.

ఆగ‌స్టు 30న `సాహో` రిలీజ్ కి వ‌స్తున్న సంద‌ర్భంగా ఈ సినిమాపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా విప‌రీత‌మైన క్రేజు నెల‌కొంది. అందుకే ఈ క్రేజును త‌న‌వైపు డైవ‌ర్ట్ అయ్యేలా ఆర్జీవీ ఇలా ప్లాన్ చేశార‌న్న‌మాట‌. సంద‌ర్భాన్ని బ‌ట్టి.. స‌రిగ్గా టైమ్ చూసి.. ఇలా త‌నదైన శైలిలో ప‌బ్లిసిటీ చేసుకోవ‌డం కొత్తేమీ కాదు కానీ.. ఈసారి ఆర్జీవీ నోట కులం అనే వెగ‌లు పుట్టించే మాట ప‌దే ప‌దే వ్యంగ్యంగా వినిపిస్తుండ‌డ‌మే కంప‌రం పుట్టిస్తోంది. అయితే కులం పేరుతో ఆయ‌న చేస్తున్న ఈ ప్ర‌య‌త్నం అంతే వేగంగా యూత్ లోకి దూసుకెళుతోంది. టైమింగ్ తెలియ‌డం అంటే ఇదేనేదే!


Tags:    

Similar News