దక్షిణాది చిత్రాలు మరీ ప్రధానంగా తెలుగు సినిమాలు ఉత్తరాదిలో సంచలనాలు సృష్టిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాలుగా రికార్డులు సృష్టిస్తూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు టాలీవుడ్ ని ప్రత్యేక దృష్టిలో చూస్తున్నారు. ఇటీవల హిందీ భాష వివాదం మరింత సంచలనంగా మారి పెద్ద చర్చకు దారితీసింది. ఆ తరువాత టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ ని వణికిస్తున్నాయని ముంబైకి చెందిన ప్రధాన వార్తా పత్రికలు, టీవీ ఛానల్ లు ప్రశంసిస్తూ బాలీవుడ్ పై విమర్శలు గుప్పించడంతో చాలా వరకు బాలీవుడ్ స్టార్స్ చాలా కోపంగా వున్నారు.
దీనికి తోడు వరుసగా దక్షిణాది చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ని కొల్లగొడుతుండటం మరింత ఆజ్యం పోసింది. తాజాగా `సర్కారు వారి పాట` రిలీజ్ సమయంలో బాలీవుడ్ ఎంట్రీపై స్పందించమని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా `బాలీవుడ్ నన్ను భరించలేదని సూపర్ స్టార్ మహేష్ అన్న వ్యాఖ్యలు ఇప్పడు పెద్ద దుమారాన్ని సృష్టిస్తున్నాయి. తను చెప్పిన అర్థం వేరే అయినా తన స్టేట్‌మెంట్ మాత్రం రాంగ్ గా కన్వే కావడం పెద్ద రచ్చకు తెరతీస్తోంది.
మహేష్ అన్న వ్యాఖ్యలపై ప్రస్తుతం బాలీవుడ్ కు చెందిన వారు తలో విధంగా మాట్లాడుతున్నారు. తెలుగు సూపర్ స్టార్ మహేష్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడంతో నేషనల్ మీడియా కూడా అటెన్షన్ వహించింది. దీంతో ప్రముఖులు మహేష్ వ్యాఖ్యలపై బ్యాక్ టు బ్యాక్ స్పందించడం మొదలు పెట్టారు. నేషనల్ మబీడిమయా రంగంలోకి దిగడంతో ఈ ఇష్యూ రచ్చ రచ్చగా మారుతోంది. ముందు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ మహేష్ భట్ సోదరుడు ముఖేష్ భట్ సెటైరికల్ గా స్పందించారు. బాలీవుడ్ మహేష్ రేట్ ని భరించలేకపోతే అది మరీ మంచిది. ఈ సందర్భంగా నేను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాలీవుడ్ మహేష్ అంచనాలకు అనుగుణంగా లేకపోతే అది అతని తప్పుకాదు.. అంటూ కొంత వ్యగ్యంగా మాట్లాడారు.
ఇక బోనీ కపూర్ కూడా దీనిపై స్పందించారు. మహేష్ వ్యాఖ్యలపై స్పందించడానికి నేను కరెక్ట్ పర్సన్ ని కాదు. నేను ఉత్తరాదితో పాటు దక్షిణాదికి కూడా చెందిన వాడిని. ఇప్పటికే తెలుగు, తమిళంలో సినిమాలు నిర్మించాను. త్వరలో కన్నడ, మలయాళంలో కూడా సినిమాలు తీయబోతున్నాను. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి కామెంట్స్ చేయలేను. తనకు ఏది అనిపిస్తే అది మాట్లాడే హక్కు మహేష్ కు ఉంది. బాలీవుడ్ తనని భరించలేదని అతను అనుకుని ఉండొచ్చు. అలా చెప్పడానికి తన దగ్గర తగిన కారణాలు కూడా ఉండి వుంటాయి. ఎవరి అభిప్రాయం వారిది` అని పేర్కొన్నారు.
ఇదే తరహాలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ .. హీరో మహేష్ పై కామెంట్ లు చేశారు. `మహేష్ వ్యాఖ్యలను తప్పుబట్టడానికి లేదు. ఎందుకంటే ఎక్కడ సినిమాలు చేయాలి, ఎలాంటి కథలు ఎంచుకోవాలన్నది నటుడిగా తన సొంత నిర్ణయం` అన్నారు. ఇక మహేష్ `తనని బాలీవుడ్ భరించలేదన్న వ్యాఖ్యలు తనకు అర్థం కాలేదన్నాడు. బాలీవుడ్ అనేది కేవలం ఒక సంస్థ కాదని, మీడియా వాళ్లే ఆ పేరు సృష్టించారని వర్మ తనదైన శైలిలో స్పందించారు.
అసలు మహేష్ ఏం అన్నాడు.. ఎందుకీ వివాదం రచ్చకు దారితీస్తోంది? .. తన వ్యాఖ్యల ఉద్దేశ్యం వేరని క్లారిటీ ఇచ్చినా రచ్చ ఎందుకు చేస్తున్నారన్నది ఇప్పడు ప్రధాన చర్చగా మారింది. జూన్ 3న అడివి శేష్ నటించిన `మేజర్` రిలీజ్ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ ని తన బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడని మీడియా అడిగిన ప్రశ్నకు `బాలీవుడ్ తనని భరించలేదన్నారు. అందుకే తాను సమయం వృధా చేసుకోవడం లేదని చెప్పారు. అంతే కాకుండా తెలుగు వారు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు అమితమైనవి. ప్రస్తుతం నా దృష్టంతా టాలీవుడ్ పైనే వుంది అన్నారు.
ఇందులో టాలీవుడ్ పై వున్న గౌరవం తో ఇక్కడే సినిమాలు చేస్తానన్నారే కానీ టాలీవుడ్ ని వీడనని కానీ.. బాలీవుడ్ కు వెళ్లనని కానీ ఎక్కడా చెప్పలేదు. తను అన్న కాంటెక్స్ట్ వేరు.. బయటికి పోట్రే అయిన తీరు వేరు. చివరికి తన వ్యాఖ్యల వెనకున్న అర్థాన్ని వివరిస్తూ మహేష్ క్లారిటీ ఇచ్చినా ఎందుకింత రచ్చకు తెరలేపుతున్నారని ఫ్యాన్స్ వాపోతున్నారు.