నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు అందుకున్న ప్రభాస్ నుంచి ఆదిపురుష్ సినిమా వస్తోంది అనగానే మొదట్లో ప్రేక్షకుల్లో అంచనాల స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. తప్పకుండా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని టీజర్ ముందు వరకు కూడా ప్రేక్షకులకు బలమైన నమ్మకం అయితే ఏర్పడింది. కానీ టీజర్ విడుదల తర్వాత మాత్రం అసలు ఊహించని విధంగా నెగిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు సినిమా రిసల్ట్ పై కూడా ప్రభావం చూపి అవకాశం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ సినిమా టీజర్ పై వస్తున్న ట్రోలింగ్స్ గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ సినిమా టీజర్ చూడగానే మొదట నాకు కూడా కొంత భిన్నంగా అనిపించింది. అయితే ముందుగా మనం ప్రేక్షకులకు ఏం చెప్పాలి అనుకుంటున్నామో అనే విషయం కూడా వారికి అర్థమయ్యేలా చెబితే బాగుండేదేమో అని నాకు అనిపించింది. ముఖ్యంగా రావణాసుర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ ను చూసిన విధానం కొంత కొత్తగా అనిపించింది.
ఎప్పటినుంచో నేను రావణాసుర పాత్ర అనగానే ఎస్పి రంగారావు గారిని ఊహించుకునేవాడిని. ఆయనకు ఒక లుక్ డిఫరెంట్ గా ఉండేది. అదే తరహాలో ఆ తర్వాత చాలా రమైన పాత్రలు వచ్చాయి. కానీ సైఫ్ అలీ ఖాన్ అలాంటి పాత్రలో ఉండేసరికి నాకు కూడా అంతేగా కనెక్ట్ కాలేదు. ఒకరు ఫోన్ చేసి రాముడికి మీసాలు ఏంటి అని కూడా నాతో అన్నారు.
అందుకు నేను వాళ్ళు ఏదో కొత్తగా ట్రై చేయాలని ఆలోచనతో ఉన్నట్లు సమాధానం ఇచ్చాను. ఇప్పటివరకు వచ్చిన రామాయణం కథలో అన్నీ కూడా రెగ్యులర్ గా ఉన్నాయి. కానీ దీంతో వాళ్ళు యానిమేషన్ తరహాలో డిఫరెంట్ గా చూపించబోతున్నట్లు అనిపించి ఉండవచ్చు.
కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా యానిమేటెడ్ తరహాలో సినిమాను చూపించాలని అనుకున్నప్పుడు చిత్ర యూనిట్ సభ్యులు ముందుగానే వీక్షకుల్లో ఒక భావన అయితే కలిగించాలి. క్లారిటీగా ముందే చెప్పి ఉంటే ఈ తరహా ట్రోలింగ్ వచ్చేది కాదేమో. . అని రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ఒక వివరణ అయితే ఇచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.