చిరంజీవి తన కొడుకు చరణ్ ని కాకుండా పక్కింటివారి కొడుకుని పరిచయం చేస్తారా?
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు నెపోటిజంపై చర్చ జరుగుతోంది. సుశాంత్ ఆత్మహత్యకు సినీ ఇండస్ట్రీలో ఉండే నెపోటిజం మరియు కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులే కారణమని నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. అతనికి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ లేకపోవడం వలన కనీస గౌరవం ఇవ్వలేదని.. సుశాంత్ ని అన్ని విధాలుగా తొక్కేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ప్రముఖ ఛానల్ తో నెపోటిజం పై స్పందించారు.
వర్మ మాట్లాడుతూ ''వ్యాపారం కావచ్చు.. రాజకీయం కావచ్చు.. సినిమా కావచ్చు.. రంగం ఏదైనా తమ కుటుంబంలోని సభ్యుడ్ని ప్రోత్సహించుకోవడం కొత్త విషయం కాదు'' అని చెప్పుకొచ్చాడు. నెపోటిజం అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. వారి వారి పిల్లల్ని వారి బంధువుల్ని ప్రోత్సహించుకోవడం కామన్ గా అన్ని రంగాల మాదిరే సినిమా ఇండస్ట్రీలోనూ ఉంది. నెపోటిజం అనేది కొత్తేం కాదు. అయితే దీని కారణంగా టాలెంట్ ని తొక్కేస్తున్నారనే ఆరోపణల్ని నేను వ్యతిరేకిస్తున్నాను. కాబట్టి ఆ ఆరోపణలు పనిలేని వాళ్లు పబ్లిసిటీ కోసం చేసే ప్రచారం అని వర్మ కామెంట్ చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ లోకేష్ కు చంద్రబాబు.. వైఎస్ జగన్ కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని అప్పగించారు. అందులో తప్పేమీ లేదు. వారి ఛాయిస్ ప్రకారం వారికి ఉన్న ఫాలోయింగ్ కు అనుకూలంగా ఇలాంటి డెసిషన్స్ జరుగుతాయి. దానికి నెపోటిజమని పేరు పెట్టడం సరికాదు అని చెప్పారు. చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్ ను ఇంట్రడ్యూస్ చేయడంలో తప్పేంటి.. తన కుమారుడిని ప్రోత్సహించుకోకపోతే పక్కింటి వాడి కొడుకును పరిచయం చేస్తాడా.. తమ కుమారులు సక్సెస్ అవుతారా లేదా ఫెయిల్ అవుతారా అనేది వాళ్లకు సంబంధించిన విషయమని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు.
విజయ్ దేవరకొండకు ఏం బ్యాగ్రౌండ్ ఉంది.. వాళ్ల నాన్నకి ఇండస్ట్రీతో పరిచయాలు లేవు.. వ్యాపారవేత్త కూడా కాదు.. మరి విజయ్ ఎలా సక్సెస్ అయ్యాడు. టాలెంట్ ఉంది కాబట్టే సూపర్ స్టార్ అయ్యాడు. అయితే ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడవు. అది డిసైడ్ చేసేది ప్రేక్షకులు. హీరోని చేయాలన్నా.. జీరోగా మార్చాలన్నా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. చాలా మంది హీరోలు తమ పిల్లలను స్టార్ హీరోలుగా చేయలేకపోయారనేది అందరికీ తెలిసిందే కదా అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.
సుశాంత్ విషయంలో ఆయన ఫెయిల్యూర్ అని అనలేం. ఫ్లాప్ హీరో అని అనలేం. తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. బాలీవుడ్‌లో టాప్ 15 స్టార్ హీరోల్లో ఒకరిగా ఉన్నారు. అతని ఆత్మహత్యకు ఫెయిల్యూర్ అనేది కారణం అని నిర్ధారించలేం’ అంటూ చెప్పుకొచ్చారు వర్మ. ఇక కరణ్ జోహర్ కు నాకు 20 ఏళ్ల నుంచి శత్రుత్వం ఉందనేది వేరే విషయం. కాకపోతే ఇప్పుడు ఆయన టాప్ ప్రొడ్యూసర్. ఎవరిని పెట్టి సినిమా తీయాలనేది అతని ఇష్టం. స్టార్ పిల్లలకు అవకాశం ఇస్తారా.. బయటి వ్యక్తులకు ఆఫర్లు ఇస్తారా.. నిర్మాతగా తన ఛాయిస్ అని వర్మ అభిప్రాయపడ్డారు.