డాక్టర్ సమరంతో రాంగోపాల్ వర్మ పరాచికాలు

Update: 2018-01-19 07:47 GMT
వివాదాల రారాజు రాంగోపాల్ వర్మ టీవీ చర్చా కార్యక్రమాల్లో తన విమర్శకులపై విరుచుకుపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన పరిధులు దాటి వ్యాఖ్యలు చేస్తున్నారని - ప్రశ్నలు వేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటికి మొన్న సామాజిక కార్యకర్త దేవిపై ‘ఆమె నోరు విప్పితే చెత్తచెత్త అంటుంటారు, ఆమె చెత్త జీవితం గడుపుతున్నారు’ అంటూ విరుచుకుపడిన వర్మ తాజాగా ప్రఖ్యాత సెక్సాలజిస్టు డాక్టర్ సమరంతోనూ అదే విధంగా వ్యవహరించారు. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు వేసి ఇబ్బందిపెట్టారు.
    
రాంగోపాల్ వర్మ ఇప్పుడు ‘గాడ్ - సెక్స్ అండ్ ట్రూత్’ పేరుతో అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాను తెచ్చి హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది అంతటా చర్చనీయం కావడంతో టీవీ9లో దీనిపై రాంగోపాల్ వర్మ - సెక్సాలజిస్టు డాక్టర్ సమరంతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ... సమరానికి వేసిన ప్రశ్నపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
    
‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’పై చర్చ సందర్భంగా చివర్లో వర్మ.. ‘సమరం గారూ.. మీరు చివరిగా ఎప్పుడు సెక్సులో పాల్గొన్నారో చెప్పండి’ అని అడిగారు. దానికి సమరం  నవ్వి.. అది తన వ్యక్తిగత విషయం కాబట్టి ఓపెన్ ఫోరంలో షేర్ చేసుకోలేనని చెప్పారు. తాను తొలిసారి ఎప్పుడు హస్తప్రయోగం చేసుకున్నాను.. మొదటిసారి ఎప్పుడు సెక్స్ చేశాను, భార్యతో ఏం చేస్తాను వంటివన్నీ కావాలంటే వర్మతో వ్యక్తిగతంగా కూర్చుని చర్చించగలనని సమాధానమిచ్చారు. చాలాకాలంగా సెక్స్ ఎడ్యుకేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్న సమరం వంటివారిని ఇలా పని గట్టుకుని ఇబ్బంది పెట్టే ప్రశ్న అడగడంపై విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. 

Full View
Tags:    

Similar News