వివాదాస్పద వ్యాఖ్యలకు.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు దర్శకులు రాంగోపాల్ వర్మ. తానెక్కడున్నా.. తన గురించి మాత్రమే మాట్లాడుకునేలా చేయటంలో ఆయన ఎప్పుడు సక్సెస్ అవుతూనే ఉంటారు. ఏం మాట్లాడితే.. అందరిని ఎంతలా ఆకర్షించొచ్చన్న విషయంలో వర్మకున్న టాలెంట్ అంతా ఇంతా కాదు.
తాజాగా ఆయన స్టాలిన్ పేరుతో తెలుగు లో వస్తున్న తమిళ డబ్బింగ్ చిత్రానికి సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యారు. రంగం ఫేం జీవా హీరోగా.. నవదీప్ విలన్ గా నటించిన ఈ చిత్రం ట్రైలర్ తనకు నచ్చిందన్నారు వర్మ. స్టాలిన్ అన్నది తన ఫేవరేట్ పేరని.. రష్యా నియంతగా గుర్తు చేసుకున్నారు. గతంలో ఇదే పేరుతో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేశారన్నారు.
చాలా రోజుల తర్వాత మళ్లీ స్టాలిన్ అనే పేరును తాను వింటున్నట్లు చెప్పిన వర్మ.. జీవా చాలా ఈజ్ తో నటించాడని.. నవదీప్ లుక్స్ డిఫరెంట్ గా ఉన్నాయన్నారు. తనకు హీరోల కంటే కూడా విలన్స్ అంటే ఇష్టమన్న వ్యాఖ్యలు చేశారు. ఈ నెల ఏడున (ఈ శుక్రవారం) విడుదల కానున్న ఈ సినిమాను దర్శకుడు బాగా హ్యాండిల్ చేశారన్నారు. ఎప్పటిలానే అందరికంటే భిన్నమైన వ్యాఖ్యలతో తన మార్క్ ను ప్రదర్శించారు వర్మ.