ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీ ఎంపీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం.. పార్లమెంట్ లో పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా ప్రవర్తించడం అతడికి షోకాజ్ నోటీస్ ఇచ్చే దాక వ్యవహారం వెళ్లింది. తొలిసారి జగన్ కు రెబల్ గా ఓ నాయకుడు నిలవడం సంచలనంగా మారింది. ఈ సమయంలో సంచలన వార్తలకు కేరాఫ్ గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వచ్చాడు. రఘురామ కృష్ణంరాజుకు మద్దతుగా నిలిచాడు.
ఆర్జీవీ, రఘురామ కృష్ణంరాజు ఇద్దరూ పరస్పరం సామాజిక మాధ్యమాల్లో పొగడ్తలు కురిపించుకుంటున్నారు. మీపై వర్మ ప్రభావం ఏం లేదు కదా?? అని నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజును అడిగితే ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భలేవారే.. నాపై వర్మ ప్రభావం లేకపోవడం ఏంటండీ? ఆయనంటే నాకు చాలా అభిమానం. ఆయన యూట్యూట్ అంటే పిచ్చి. తమ ఇద్దరిలో ఓ కామన్ పాయింట్ కూడా ఉందని తెలిపారు. తాను ఆయన (వర్మ) చాలా స్లోగా మాట్లాడుతుంటామని చెప్పారు. ఇద్దరి వాయిస్‌లు ఇంచుమించు ఒకేలా ఉంటాయి.. వాయిస్‌ల పరంగా మేం ఇద్దరం వీక్ అయినా ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టేస్తామని పేర్కొన్నారు.
ఈ రెబల్ ఎంపీ వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు.. మైండ్ బ్లోయింగ్.. రాజుగారూ!! రాజకీయాల్లో ఇలాంటి పర్సనాలిటీని ఇప్పుడే చూస్తున్నా.. వెరీ ఇంట్రస్టింగ్ అంటూ ఆయన ట్విట్టర్ లో కామెంట్ చేశారు. నాకు రాజు అనే క్యాస్ట్ ఫీలింగ్ లేదు.., కాని నాకు కచ్చితంగా రఘురామ కృష్ణరాజు ఫీలింగ్ ఉంది. ఎందుకంటే అతను నిజమైన సింహం.. అతను నిజమైన హీరో.. సింహం ఒక్కటే సింగిల్’ అంటూ ట్వీట్ చేశారు. ఇది ఏపీలో వైరల్ గా మారింది. దీనిపై కొందరు వర్మ.. రఘురామ కృష్ణంరాజును వెనకేస్తుండగా మరికొందరు వారి తీరుపై విమర్శలు చేస్తున్నారు.