పేర్ని నానితో ముగిసిన ఆర్జీవీ భేటీ..! ఎవ్వరు ఏం మాట్లాడినా నాకు సంబంధం లేదు!
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరల వివాదం నేపథ్యంలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోమవారం సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. అమరావతి సచివాలయంలోని మినిస్టర్ ఛాంబర్ లో దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశం ముగిసింది. సినిమా టికెట్ల ధరలను పెంచాలనే సినీ ప్రముఖుల డిమాండ్ కు వర్మ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు మంత్రితో ఈ విషయాల గురించి దర్శకుడు సవివరంగా చర్చించినట్లు తెలుస్తోంది.
సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద పలువురు సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేసారు. అయితే దీనిపై కాస్త ఆలస్యంగా స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తనదైన శైలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ మేరకు మంత్రి పేర్నినానితో న్యూస్ ఛానల్ డిబేట్ లో కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆర్జీవీ - సినిమాటోగ్రఫీ మినిస్టర్ మధ్య ట్వీట్ వార్ జరిగింది. దీనిపై చర్చిద్దామని వర్మ చేసిన ట్వీట్లపై స్పందించిన పేర్ని నాని.. ఈరోజు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో నేడు ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో చేరుకున్న రామ్ గోపాల్ వర్మ.. అక్కడి నుంచి పోలీసుల భారీ బందోబస్తు నడుమ వెలగపూడి సచివాలయానికి చేరుకున్నారు. వర్మ - పేర్ని నాని మధ్య జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మధ్యలో ఆర్జీవీకి మంత్రి నాని స్పెషల్ లంచ్ ఏర్పాటు చేసారు.
రొయ్యల కూర - మటన్ - చికెన్ ప్లేయిన్ బిర్యాని వంటి నాన్ వెజ్ ఐటమ్స్ తో వర్మకు మంత్రి నాని ప్రత్యేక ఆతిధ్యం ఇచ్చారని తెలుస్తోంది. లంచ్ తరువాత ఇరువురు తిరిగి సినిమా టికెట్ ధరల మీద చర్చలు ప్రారంభించారు. పేర్ని నానితో సమావేశానికి ముందు ఆర్జీవీ మీడియాతో ముచ్చటించారు. ''పేర్ని నానితో మాట్లాడి అన్ని విషయాలు చెబుతాను. సినిమా టికెట్ల ధరల అంశంపై ఆయనకు ఉన్న అనుమానాలు క్లియర్ చేస్తాను'' అని అన్నారు.
''ఒక ఫిల్మ్ మేకర్ గా మాట్లాడడానికి వచ్చాను. ఎవ్వరు ఏం మాట్లాడినా నాకు సంబంధం లేదు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిది. నాగార్జున వ్యాఖ్యలపై కానీ, లేఖలు, ఇతరత్రా కామెంట్స్ గురించి నేను మాట్లాడను. నేను కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి వచ్చాను'' అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. కాగా, ఆర్జీవీ - పేర్ని నాని భేటీతో సినిమా టికెట్ల ధరల సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ సమావేశం వివరాలను వీరు మీడియాకు వెల్లడిస్తారో లేదో చూడాలి.