సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడనే విషయం అందరికి తెలిసిందే. అదే సమయంలో ప్రజలను భయపెట్టిస్తోన్న, ఆలోచింపజేస్తోన్న విషయంపై సినిమాలు తీస్తే జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని ఆర్జీవీ భావిస్తుంటారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రళయతాండవం చేస్తున్న సమయాన్ని అదునుగా చేసుకొని రామ్ గోపాల్ వర్మ సినిమా తీసేసాడు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వైరస్ పైనే చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది మృత్యువాత పడ్డారు. రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదు అవుతుండటం అందరిని కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో అందరూ ఇళ్లలో నుండి అడుగు బయట పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటుంటే ఆర్జీవీ మాత్రం ఇంట్లోనే 'కరోనా వైరస్' అనే సినిమా తీసాడు.
ఇప్పటికే 'కరోనా వైరస్' టీజర్ ను రిలీజ్ చేసిన వర్మ ఇప్పుడు తాజాగా ఈ సినిమాలోని ఒక సాంగ్ ని విడుదల చేసారు. 'దేవుడా నీకో దండం రా' అంటూ సాగే ఈ పాటను రిలీజ్ చేసిన వర్మ ''ఇది మనల్ని నాన్ స్టాప్ గా టార్చర్ చేస్తున్న దేవుణ్ణి తిడుతూ సాగే సాంగ్'' అంటూ చెప్పుకొచ్చాడు. ఆర్జీవీ 'కరోనా వైరస్' సినిమాలోని ఈ సాంగ్ ఆద్యంతం దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్లుగా తిడుతున్నట్లుగా సాగింది. ''దేవుడా నీకో దండం రా.. ఏమి పాపం చేసాం మేము.. మా మీద పగపట్టావ్. ఎందుకిలా మమల్ని చంపుతున్నావ్.. మాపైన నీకెందుకు అంత కసి.. దోమలు మిడతలు కరోనా.. ఎవరికి అవసరం ఈ హైరానా.. నీ బుర్రలో ఏముందో.. మా పూజలు నీకు సరిపోవట్లేదా.. టెంకాయలు తక్కువగా కొడుతున్నామా.. లేదా కరోనా వైరస్ మమ్మల్ని మించి నీకు పూజలు చేస్తోందా.. దేవుడా నువ్వు గొప్పా.. వైరస్ నీకన్నా గొప్పా'' అంటూ సాగిన ఈ సాంగ్ కి సిరాశ్రీ లిరిక్స్ అందించాడు. డీఎస్సార్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసి స్వయంగా పాడాడు. రామ్ గోపాల్ వర్మ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సీఎం క్రియేషన్స్ నిర్మించగా అగస్త్య మంజు దర్శకత్వం వహించారు. ఈ పాటతో దేవుడినే డైరెక్టుగా టార్గెట్ చేసిన వర్మ 'కరోనా వైరస్' సినిమా ఎన్ని సంచలనాలను సృష్టించబోతుందో చూడాలి.
Full View